రాష్ట్రపతి అభ్యర్థిగా నేనుండను
శ్రీనగర్, జూన్ 18: రాష్ట్రపతి ఎన్నికల్లో బీజేపీకి వ్యతిరేకంగా ఉమ్మడి అభ్యర్థిని నిలబెట్టి, గెలిపించుకొని తమ ఐక్యత చాటాలనుకొంటున్న విపక్షాలకు ఆ అభ్యర్థి దొరకడమే గగనమైపోయింది. రాష్ట్రపతి అభ్యర్థి రేసు నుంచి ఎన్సీపీ చీఫ్ శరద్ పవార్ ఇప్పటికే తప్పుకోగా.. నేషనల్ కాన్ఫరెన్స్ చీఫ్ ఫరూక్ అబ్దుల్లా కూడా రాష్ట్రపతి అభ్యర్థిగా ఉండబోనని శనివారం ప్రకటించారు. క్రియాశీలక రాజకీయాల్లో కొనసాగాలనుకొంటున్నానని స్పష్టం చేశారు. ఫరూక్ అబ్దుల్లా వయస్సు 84 ఏండ్లు. రాష్ట్రపతి ఎన్నికలపై ఇటీవల 17 విపక్ష పార్టీలు సమావేశమయ్యాయి. శరద్‌పవార్ అభ్యర్థిగా ఉండేందుకు తిరస్కరించడంతో పశ్చిమ బెంగాల్ సీఎం మమత.. ఫరూక్ అబ్దుల్లా, గోపాలకృష్ణ గాంధీ పేర్లను ప్రతిపాదించారు. రాష్ట్రపతి అభ్యర్థుల నామినేషన్ ప్రక్రియ ఈ నెల 29తో ముగియనున్నది. అభ్యర్థి ఎంపికపై విపక్షాలు 21న మరోసారి సమావేశం కానున్నాయి.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?

