చండీగఢ్: ప్రధాని మోదీ పంజాబ్లో నిర్వహించే ఎన్నికల ప్రచార సభల వద్ద నిరసన కార్యక్రమాలు నిర్వహించాలని రైతు సంఘాలు నిర్ణయించాయి. దీంతో బీజేపీ ఆందోళనకు గురవుతున్నది. రైతుల డిమాండ్లను మోదీ సానుకూలంగా పరిశీలిస్తారని హామీ ఇస్తున్నామని బీజేపీ నేతలు తెలిపారు. మోదీ సభలకు అంతరాయం కలిగించడానికి బదులుగా సమస్యలపై చర్చించుకుని, ఓ వినతి పత్రాన్ని తమకు ఇవ్వాలని రైతు సంఘాల నేతలకు విజ్ఞప్తి చేశారు. 23, 24 తేదీల్లో మోదీ ఎన్నికల ప్రచారం నిర్వహించనున్నారు.