Farmers March | శంభు సరిహద్దు (Shambhu Border) వద్ద మరోసారి ఉద్రిక్తత చోటు చేసుకుంది. తమ డిమాండ్ల పరిష్కారానికై రైతులు చేపట్టిన ‘ఢిల్లీ చలో’ మార్చ్‌ను పోలీసులు అడ్డుకున్నారు. దీంతో అక్కడ ఆందోళనకర పరిస్థితులు తలెత్తాయి. రైతులపై హర్యాణా పోలీసులు టియర్ గ్యాస్ (tear gas), జల ఫిరంగులను (water cannons) ప్రయోగించారు. ఈ ఘటనలో సుమారు 17 మంది రైతులకు గాయాలయ్యాయి. దీంతో రైతు సంఘాల నేతలు కీలక నిర్ణయం తీసుకున్నారు. ఢిల్లీకి తమ పాదయాత్రను నిలిపివేశారు. అంతర్గత సమావేశం అనంతరం తమ తదుపరి కార్యాచరణను ప్రకటిస్తామని రైతు నాయకుడు తేజ్వీర్ సింగ్ తెలిపారు.
తమ డిమాండ్ల పరిష్కారానికై రైతులు మరోసారి ఉద్యమబాట పట్టారు. ఇవాళ మధ్యాహ్నం ‘చలో ఢిల్లీ’ మార్చ్‌ను ప్రారంభించారు. కనీస మద్దతు ధర సహా 11 డిమాండ్ల సాధన కోసం 101 మంది రైతులు ఈ మార్చ్‌లో పాల్గొన్నారు. అయితే, రైతులను శంభు సరిహద్దు (Shambhu Border) వద్ద హర్యాణా పోలీసులు (Haryana cops) అడ్డుకున్నారు. రైతులపై బాష్పవాయువు (tear gas), జల ఫిరంగులను (water cannons) ప్రయోగించారు. దీంతో సరిహద్దు వద్ద ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.
ఇక రైతుల ఢిల్లీ చలో మార్చ్‌ను అడ్డుకోవడం ఇది మూడోసారి. డిసెంబర్ 6 నుంచి ఢిల్లీ వైపుకు వెళ్లేందుకు రైతులు ప్రయత్నించగా.. ఇప్పటికే ఆ ప్రయత్నాలను రెండుసార్లు పోలీసులు అడ్డుకున్న విషయం తెలిసిందే. దీంతో పోలీసుల తీరుపై రైతులు తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇక రైతుల ఢిల్లీ మార్చ్ నేపథ్యంలో హర్యాణా ప్రభుత్వం అప్రమత్తమైంది. ముందు జాగ్రత్త చర్యగా మొబైల్ ఇంటర్నెట్ సేవలను నిలిపివేసింది. శనివారం ఉదయం 6 గంటల నుంచి 17వ తేదీ అర్ధరాత్రి వరకూ సేవలు నిలిపివేస్తున్నట్లు ఓ ప్రకటనలో తెలిపింది.
రైతుల డిమాండ్లివి
తాము పండించిన పంటలకు కనీస మద్దతు ధరకు చట్టబద్ధత కావాలని రైతులు ప్రధానంగా కోరుతున్నారు. రుణ మాఫీ చేయాలని, రైతులు, రైతు కూలీలకు పెన్షన్ ఇవ్వాలని, విద్యుత్ చార్జీలు పెంచరాదని, రైతులపై పెట్టిన పోలీస్ కేసులు ఎత్తివేయాలని, 2021 లఖింపూర్ ఖీరి బాధితులకు న్యాయం చేయాలని, భూ సేకరణ చట్టం 2013ను పునరుద్ధరించాలని, ఆందోళనలో మరణించిన రైతుల కుటుంబాలకు నష్టపరిహారం అందజేయాలని వారు డిమాండ్ చేస్తున్నారు.
Also Read..
Farmers March | చలో ఢిల్లీ మార్చ్‌ను అడ్డుకున్న పోలీసులు.. రైతులపై బాష్పవాయువు ప్రయోగం
LK Advani | అద్వానీకి ఐసీయూలో చికిత్స : అపోలో వైద్యులు
Sanjay Raut | ఈవీఎం ఆలయం నిర్మాణం కోసం.. మహాయుతి ప్రభుత్వం నిర్ణయం తీసుకోవాలి: సంజయ్ రౌత్