Sanjay Raut | ఈవీఎం ఆలయం నిర్మాణం కోసం.. మహాయుతి ప్రభుత్వం నిర్ణయం తీసుకోవాలి: సంజయ్ రౌత్
Sanjay Raut | మహారాష్ట్రలో కొత్తగా కొలువైన బీజేపీ నేతృత్వంలోని మహాయుతి కూటమి ప్రభుత్వంపై శివసేన (యూబీటీ) నేత సంజయ్ రౌత్ మండిపడ్డారు. ఎలక్ట్రానిక్ ఓటింగ్ మెషిన్ (ఈవీఎం) ఆలయం నిర్మించడంపై తొలి కేబినెట్ భేటీలో నిర్ణయం తీసుకోవాలని ఎద్దేవా చేశారు.
ముంబై: మహారాష్ట్రలో కొత్తగా కొలువైన బీజేపీ నేతృత్వంలోని మహాయుతి కూటమి ప్రభుత్వంపై శివసేన (యూబీటీ) నేత సంజయ్ రౌత్ (Sanjay Raut) మండిపడ్డారు. ఎలక్ట్రానిక్ ఓటింగ్ మెషిన్ (ఈవీఎం) ఆలయం నిర్మించడంపై తొలి కేబినెట్ భేటీలో నిర్ణయం తీసుకోవాలని ఎద్దేవా చేశారు. శనివారం మీడియాతో సంజయ్ రౌత్ మాట్లాడారు. ‘తొలుత సీఎం నేతృత్వంలో అక్కడ (నాగ్‌పూర్‌లో) ఈవీఎంలతో ఊరేగింపు నిర్వహించాలి. నాగ్‌పూర్‌లోని ఆర్ఎస్ఎస్ ప్రధాన కార్యాలయం ముందు ఈవీఎంల ఆలయాన్ని నిర్మించే నిర్ణయం కూడా తొలి కేబినెట్ సమావేశంలో సీఎం తీసుకోవాలని భావిస్తున్నా’ అని అన్నారు.
కాగా, కొత్తగా ఏర్పాటైన మహాయుతి ప్రభుత్వం క్యాబినెట్ బాధ్యతలపై ఇంకా నిర్ణయం తీసుకోలేక పోయిందని సంజయ్ రౌత్ విమర్శించారు. మహారాష్ట్రలో హత్యలు, అత్యాచారాలు రాజ్యమేలుతున్నాయని ఆరోపించారు. ‘రాష్ట్రంలో కొత్త ప్రభుత్వం ఏర్పడి నెల రోజులు కావస్తున్నా ఎవరికి ఏ శాఖ ఉందో తెలియడం లేదు. మహారాష్ట్రలోని గ్రామాల్లో ప్రతిరోజూ హత్యలు, అత్యాచారాలు జరుగుతున్నాయి. దీనికి సీఎం సమాధానం చెప్పలేకపోతున్నారు. మహారాష్ట్రలో అరాచకాలు విస్తరించాయి. ఈ ప్రభుత్వం ఈవీఎంలతో ఏర్పడింది. వారికి బ్రెయిన్ లేదు. వారి మెదళ్లలో ఈవీఎంలు ఉన్నాయి’ అని సంజయ్ రౌత్ విమర్శించారు.
#WATCH | Mumbai: Shiv Sena (UBT) MP Sanjay Raut says, “…First of all, the procession of the Chief Minister will be taken out there (in Nagpur). I think that before taking out the procession of the CM, they should take out a procession of EVMs and in the first cabinet they… pic.twitter.com/0ue8Labe5v
— ANI (@ANI) December 14, 2024
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Asian Para Games | ఆసియా పారా క్రీడల్లో భారత్ సరికొత్త చరిత్ర.. 114 పతకాలతో రికార్డు!
India vs Zimbabwe ODI | షఫాలీ విధ్వంసం.. రావల్ శతకం.. జింబాబ్వేపై భారత్ ఘన విజయం!
firecracker factory explodes | బాణసంచా కర్మాగారంలో పేలుడు.. నలుగురు మృతి
Neha Bora | నేహాబోరాకు ఢిల్లీ హై కోర్టు షాక్.. పీస్ బాండ్‌కు వ్యతిరేకంగా దాఖలు చేసిన పిటిషన్ కొట్టివేత
‘ముదిరాజ్‌లను బీసీ-ఏలో చేర్చే హామీని వ్యతిరేకిస్తున్నాం’
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

