చండీగఢ్, మార్చి 10: పంటల కనీస మద్దతు ధరకు చట్టబద్ధత, ఇతర డిమాండ్లతో పంజాబ్లోని పలు ప్రాంతాల్లో రైతులు ఆదివారం రైలు పట్టాలపై బైఠాయించి రైల్ రోకో నిర్వహించారు. సంయుక్త కిసాన్ మోర్చా (నాన్ పొలిటికల్), కిసాన్ మజ్దూర్ మోర్చా (కేఎంఎం) ఇచ్చిన పిలుపు మేరకు రైతులు ఆందోళన చేపట్టారు.
దీంతో మధ్యాహ్నం 12 నుంచి సాయంత్రం 4 గంటల వరకు పలు రైళ్ల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. పంజాబ్లోని 22 జిల్లాల్లో 52 ప్రదేశాల్లో రైల్ రోకో జరిపినట్టు రైతు సంఘం నేత శర్వణ్ పాంథేర్ తెలిపారు. కేంద్రంపై ఒత్తిడి తేవడానికే తామీ నిరసనలు చేపట్టినట్టు రైతు సంఘాలు ప్రకటించాయి.