Farmers | మళ్లీ రైతుల పోరుబాట.. ఎంఎస్పీకి చట్టబద్ధత, రుణమాఫీ తదితర డిమాండ్ల సాధనకు ఉద్యమం: సాన్ మోర్చా
రైతుల సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ మళ్లీ ఉద్యమాన్ని ప్రారంభించనున్నట్టు సంయుక్త కిసాన్ మోర్చా(ఎస్కేఎం) గురువారం ప్రకటించింది.
- దేశవ్యాప్త నిరసనలకు సమాయత్తం
- సంయుక్త కిసాన్ మోర్చా ప్రకటన
Farmers | న్యూఢిల్లీ, జూలై 11: రైతుల సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ మళ్లీ ఉద్యమాన్ని ప్రారంభించనున్నట్టు సంయుక్త కిసాన్ మోర్చా(ఎస్కేఎం) గురువారం ప్రకటించింది. 2020-21లో కేంద్రం తెచ్చిన వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా ఉద్యమాన్ని చేపట్టిన రైతు సంఘాల ఐక్య వేదిక సంయుక్త కిసాన్ మోర్చా సర్వసభ్య సమావేశం బుధవారం జరిగింది. ఇందులో తీసుకున్న నిర్ణయాలను ఎస్కేఎం గురువారం ప్రకటించింది.
మళ్లీ ఉద్యమాన్ని పునఃప్రారంభించాలని నిర్ణయించినట్టు పేర్కొన్నది. ముఖ్యంగా పంటల కనీస మద్దతు ధరలకు చట్టబద్ధత కల్పించాలని, రైతుల రుణాలు మాఫీ చేయాలనే డిమాండ్‌తో ఉద్యమ కార్యాచరణను సిద్ధం చేసినట్టు తెలిపింది. 2021 డిసెంబర్ 9న రైతు సంఘాలతో జరిగిన చర్చల్లో కేంద్రం చేసుకున్న ఒప్పందంలోని అంశాలను నెరవేర్చాలని డిమాండ్ చేసింది.
జూలై 16 నుంచి 18 వరకు ప్రధానమంత్రి, ప్రతిపక్ష నేత సహా ఎంపీలందరినీ కలిసి తమ డిమాండ్లతో కూడిన వినతిపత్రాన్ని అందించనున్నట్టు తెలిపింది. ఉద్యమం సమయంలో మరణించిన అన్నదాతల గౌరవార్థం ఢిల్లీ సరిహద్దుల్లోని టిక్రి, సింఘు వద్ద స్మారకాలను నిర్మించనున్నట్టు వెల్లడించింది. అలాగే 2021లో ఉత్తరప్రదేశ్‌లోని లఖింపూర్ ఖీరీలో కేంద్ర మంత్రి అజయ్ మిశ్రా కుమారుడు ఆశిష్ మిశ్రా కాన్వాయ్ దూసుకెళ్లడంతో ప్రాణాలు కోల్పోయిన అన్నదాతలకు పరిహారం చెల్లించాలని డిమాండ్ చేసింది.
ఈసారి దేశవ్యాప్త ఉద్యమం
ప్రపంచ వాణిజ్య సంస్థ(డబ్ల్యూటీఓ) నుంచి భారత్ బయటకు రావాలని, వ్యవసాయ రంగంలోకి బహుళ జాతి సంస్థలను అనుమతించవద్దని ఎస్కేఎం నేతలు డిమాండ్ చేశారు. ఈ మేరకు ఆగస్టు 9న ‘క్విట్ ఇండియా డే’ను ‘కార్పొరేట్స్ క్విట్ ఇండియా డే’గా నిర్వహిస్తామని, దేశవ్యాప్తంగా తమ డిమాండ్ల సాధనకు ప్రదర్శనలు నిర్వహిస్తామని ప్రకటించారు.
తమ డిమాండ్ల సాధనకు ఇక కొత్త పద్ధతుల్లో ఉద్యమాన్ని నడిపించాలని రైతు సంఘాలు నిర్ణయించాయి. ఈసారి ఢిల్లీకి ర్యాలీ చేపట్టడం కాకుండా దేశవ్యాప్త నిరసనలు తెలుపుతామని, ముఖ్యంగా అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న మహారాష్ట్ర, జార్ఖండ్, జమ్ము కశ్మీర్, హర్యానా రాష్ర్టాలపై ప్రధాన దృష్టి సారిస్తామని ఎస్కేఎం నేతలు ప్రకటించారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video
Watch: శివసేన నేత ఇంట్లో డ్రగ్స్ ఉంచిన పోలీస్ అధికారి.. తర్వాత ఏం జరిగిందంటే?
Viral news | ఆ ఇంట్లో రోజూ నాగుపాముల కలకలం.. ఏడ వెతికినా పాము గుడ్లే..!
Viral News | అనారోగ్యంతో ఉన్న అమ్మకోసం కేంద్ర మాజీ మంత్రి వేణుగానం..!
Watch: 8 ఏళ్ల బాలుడి దారుణం.. క్లాస్‌లో యూకేజీ బాలికపై రాయితో దాడి, చిన్నారి పరిస్థితి విషమం

