న్యూఢిల్లీ: డిమాండ్ల సాధనకు చేస్తున్న ఆందోళనల్లో భాగంగా ఈ నెల 26న రిపబ్లిక్ డే నాడు దేశవ్యాప్తంగా ట్రాక్టర్ ర్యాలీలు నిర్వహించనున్నట్టు రైతు సంఘాలు ప్రకటించాయి. పంటల కనీస మద్దతు ధరకు చట్టబద్ధతతో పాటు పలు డిమాండ్లతో రైతు నేత డల్లేవాల్ నవంబర్ 26 నుంచి ఆమరణ దీక్ష చేస్తున్న క్రమంలో సంయుక్త కిసాన్ మోర్చా (రాజకీయేతర), కిసాన్ మజ్దూర్ మోర్చా నేతలు పంజాబ్-హర్యానా సరిహద్దు వద్ద జరిపిన ధర్నాలో ఈ ప్రకటన చేశారు.
కాగా, వ్యవసాయ రంగంలో మోదీ ప్రభుత్వం తెచ్చిన వివాదాస్పద సంస్కరణలను తిరస్కరిస్తూ ఢిల్లీలోని ఎర్రకోట వద్ద వేలాది ది రైతులతో 2021లో నిర్వహించిన ట్రాక్టర్ ర్యాలీ హింసాత్మకంగా మారింది.