ముంబై ; ఎండనకా వాననకా.. రోడ్ల పక్కనే విశ్రాంతి తీసుకుంటూ.. కాళ్లు పొక్కినా లెక్కచేయకుండా లక్ష్య సాధన కోసం కదం తొక్కిన మహారాష్ట్ర రైతుల పాదయాత్ర శుక్రవారం థాణె చేరుకున్నది. ఉల్లికి కనీస మద్దతు ధర కల్పించాలని, తమ సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ నాసిక్ నుంచి ముంబైకి అన్నదాతలు లాంగ్ మార్చ్ చేపట్టిన విషయం తెలిసిందే.