బటిండా: ప్రధాని మోదీ ఇవాళ పంజాబ్‌లో పర్యటిస్తున్నారు. అయితే భద్రతా లోపం వల్ల ఫిరోజ్‌పూర్ పర్యటనను రద్దు చేశారు. ఇవాళ ఫిరోజ్పూర్లో పలు అభివృద్ధి కార్యక్రమాలకు ప్రధాని శంకుస్థాపన చేయాల్సి ఉంది. అక్కడే ఓ బహిరంగసభలోనూ ప్రధాని మాట్లాడాలి. కానీ రోడ్డు మార్గంలో రైతులు ధర్నా చేయడం వల్ల ప్రధాని తన పర్యటన వాయిదా వేసుకున్నారు. ప్రధాని మోదీ పర్యటనను రైతులు వ్యతిరేకిస్తున్నారు. ఇవాళ ఉదయం ఆయన భటిండా బైసియానా ఎయిర్‌ఫోర్స్ స్టేషన్లో దిగారు. రోడ్డు బ్లాక్ చేయడంతో.. ఆయన ఢిల్లీకి తిరుగు ప్రయాణం అయినట్లు తెలుస్తోంది. రెండేళ్ల తర్వాత ప్రధాని మోదీ పంజాబ్‌లో పర్యటిస్తున్నారు. పంజాబ్ ఆర్థిక మంత్రి మన్‌ప్రీత్ బాదల్.. మోదీని ఆహ్వానిస్తున్న ఫోటోను ట్వీట్ చేశారు.
రోడ్డుపైనే 20 నిమిషాలు..
ఫిరోజ్‌పూర్‌కు రోడ్డు మార్గంలో వెళ్తున్న ప్రధానికి రైతులు జలక్ ఇచ్చారు. భారీ ట్రాఫిక్ జామ్ క్రియేట్ చేయడంతో.. రహదారిపై మోదీ కాన్వాయ్ సుమారు 20 నిమిషాల పాటు చిక్కుకున్నట్లు తెలుస్తోంది. రైతు చట్టాలకు వ్యతిరేకంగా ఇవాళ నిరసనకారుల ఆందోళనలతో పంజాబ్ అట్టుడికిన విషయం తెలిసిందే. అయితే ఇవాళ రోడ్డు మార్గాన్ని కూడా రైతు నిరసనకారులు అడ్డుకున్నారు. పంజాబ్‌లోని కాంగ్రెస్ ప్రభుత్వం సరైన రీతిలో సెక్యూర్టీ ఇవ్వలేకపోయిందని కేంద్ర హోంశాఖ ఓ ప్రకటనలో తెలిపింది.
బటిండాలో విమానం దిగిన ప్రధాని మోదీ.. అక్కడ నుంచి హుస్సేన్‌వాలాలో ఉన్న జాతీయ అమరవీరుల స్మారకం వద్దకు వెళ్లాల్సి ఉంది. అయితే ఆ స్మారకం వద్దకు వాస్తవానికి హెలికాప్టర్లో వెళ్లాలి. కానీ వర్షం వల్ల వాతావరణం సరిగా లేదు. విజిబులిటీ లేకపోవడంతో.. 20 నిమిషాల పాటు వెదర్ క్లియర్ కోసం ప్రధాని ఎదురుచూశారు. వాతావరణం తేరుకోపోవడంతో జాతీయ అమరవీరుల స్మారకం వద్దకు రోడ్డు మార్గంలో వెళ్లాలని ప్రధాని నిర్ణయించారు.
Security breach in PM Narendra Modi's convoy near Punjab's Hussainiwala in Ferozepur district. The PM's convoy was stuck on a flyover for 15-20 minutes. pic.twitter.com/xU8Jx3h26n
— ANI (@ANI) January 5, 2022
రోడ్డు మార్గంలో వెళ్లేందుకు కనీసం రెండు గంటల సమయం పడుతుంది. పంజాబ్ డీజీపీ క్లియరెన్స్ ఇచ్చిన తర్వాతే రోడ్డు మార్గంలో వెళ్లేందుకు ప్రధాని అంగీకరించినట్లు కేంద్రం హోంశాఖ తన ప్రకటనలో తెలిపింది. భటిండా విమానాశ్రయం నుంచి 30 కిలోమీటర్ల దూరం వెళ్లగానే.. ప్రధాని కాన్వాయ్ ఓ ఫ్లైఓవర్‌ను చేరుకున్నది. అక్కడ రోడ్డుపై నిరసనకారులు ధర్నా చేపట్టారు. రోడ్డు బ్లాక్ కావడంతో ప్రధాని వెనుదిరిగారు. ఈ ఘటన పట్ల పూర్తి నివేదిక ఇవ్వాలని పంజాబ్ ప్రభుత్వాన్ని కేంద్ర హోంశాఖ కోరింది.