భోపాల్ : పండించిన పంటకు ప్రతిఫలం లభించినప్పుడే రైతు సంతోషంగా ఉంటాడు. ఆ పంటకు సరైన ధర లభించకపోయినా, నాశనమైన బాధిత రైతు తీవ్ర మనోవేదనకు గురవుతాడు. తాను కష్టపడి పండించిన వెల్లుల్లికి సరైన ధర లభించలేదని తీవ్ర మనస్తాపానికి గురైన రైతు.. మార్కెట్లోనే దానికి నిప్పు పెట్టాడు. ఈ ఘటన మధ్యప్రదేశ్లోని మందసౌర్ మండిలో చోటు చేసుకుంది.
శంకర్ అనే రైతు తాను పండించిన 160 కిలోల వెల్లుల్లిని మందసౌర్లోని హోల్ సేల్ మార్కెట్కు తీసుకొచ్చాడు. బహిరంగ వేలంలో ఆ వెల్లుల్లికి సరైన ధర లభించలేదు. రూ. 5 వేలు ఖర్చు పెట్టి మార్కెట్కు వెల్లుల్లిని తరలిస్తే.. బహిరంగ వేలంలో దాని విలువ కేవలం రూ. 1100 మాత్రమే. దీంతో తీవ్ర ఆవేదనకు గురైన రైతు.. వెల్లుల్లిని విక్రయించకుండా నిప్పు పెట్టాడు. ఈ సీజన్లో వెల్లుల్లి సాగుకు రూ. 2.5 లక్షలు ఖర్చు పెట్టానని, కానీ తాను పొందిన ఆదాయం మాత్రం రూ. 1 లక్ష అని శంకర్ బోరుమన్నాడు.
A young #Farmers Shankar Sirfira set ablaze around 160 kg garlic produce on not getting adequate price from traders during open auction in the Mandsaur Mandi @ndtv @ndtvindia pic.twitter.com/90wdDA7OR8
— Anurag Dwary (@Anurag_Dwary) December 19, 2021