వచ్చే నెల 16న భారత్ బంద్
రైతు సమస్యల పరిష్కారాన్ని కోరుతూ వచ్చే నెల 16న భారత్ బంద్ చేపట్టనున్నట్టు భారతీయ కిసాన్ యూనియన్ అధికార ప్రతినిధి రాకేశ్ టికాయిత్ చెప్పారు. బుధవారం ఆయన ముజాఫర్‌నగర్‌లో విలేకరులతో మాట్లాడుతూ ‘పంటలకు కనీస మద్దతు ధర లభించడంలేదు. అసలు ఈ విషయాన్ని కేంద్ర ప్రభుత్వం పట్టించుకోవడం లేదు.
- రైతు సంఘాల ప్రకటన
- ఎంఎస్పీకి చట్టబద్ధత సహాసమస్యల పరిష్కారానికి డిమాండ్
నోయిడా, జనవరి 24: రైతు సమస్యల పరిష్కారాన్ని కోరుతూ వచ్చే నెల 16న భారత్ బంద్ చేపట్టనున్నట్టు భారతీయ కిసాన్ యూనియన్ అధికార ప్రతినిధి రాకేశ్ టికాయిత్ చెప్పారు. బుధవారం ఆయన ముజాఫర్‌నగర్‌లో విలేకరులతో మాట్లాడుతూ ‘పంటలకు కనీస మద్దతు ధర లభించడంలేదు. అసలు ఈ విషయాన్ని కేంద్ర ప్రభుత్వం పట్టించుకోవడం లేదు. ఎంఎస్పీకి చట్టబద్ధత ఏదీ?. ఇదే కాదు.. రైతులకు సంబంధించిన చాలా విషయాలను కేంద్రం పట్టించుకోవడం లేదు’ అని విమర్శించారు.
అలాగే దేశంలో నిరుద్యోగం, అగ్నివీర్ పథకం, పెన్షన్ పథకాల్లో సమస్యలు ఉన్నాయని, వీటిని కేంద్రం గాలికొదిలేసిందని ధ్వజమెత్తారు. వీటన్నింటినీ కేంద్రం దృష్టికి తీసుకెళ్లడానికి భారత్ బంద్ చేపడుతున్నట్టు వెల్లడించారు. ఈ బంద్‌లో సంయుక్త కిసాన్ మోర్చాతోపాటు అన్ని రైతు సంఘాలు పాల్గొంటాయని టికాయిత్ చెప్పారు. ఫిబ్రవరి 16న రైతులు తమ పొలాలకు వెళ్లకుండా నిరసన తెలుపుతారని పేర్కొన్నారు. ఈ బంద్‌లో రవాణా రంగం కార్మికులతోపాటు ఇతర వర్గాల వాళ్లు కూడా పాల్గొనాలని విజ్ఞప్తి చేశారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Antibiotics | యాంటీ బయోటిక్స్‌కు లొంగని బ్యాక్టీరియాను సైతం నాశనం చేసే వైరస్.. సైంటిస్టుల పరిశోధన..
Teacher Rapes Girl | విద్యార్థినులకు లైంగిక వేధింపులు, ఒక బాలికపై అత్యాచారం.. ప్రభుత్వ టీచర్ అరెస్ట్
KCR | తెలంగాణ ఆడబిడ్డలకు కేసీఆర్ సద్దుల బతుకమ్మ శుభాకాంక్షలు
Delhi Police | నిరసనల సందర్భంగా మహిళలపై లైంగిక హింస.. ఢిల్లీ పోలీస్ హెడ్‌క్వార్టర్స్ వరకు మహిళా సంఘాల ర్యాలీ
Haiku Movie | కాలేజీ రోజులను గుర్తు చేసే సున్నితమైన ప్రేమకథ ‘హైకూ’.. అక్టోబర్ 23న భారీ విడుదల!
ట్రెండింగ్ వార్తలు
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్

