న్యూఢిల్లీ : ప్రముఖ జర్నలిస్ట్, రచయిత మార్క్ టులీ కన్నుమూశారు. అనేక ఏండ్లుగా ఉపఖండంలో బ్రిటిష్ బ్రాడ్‌కాస్టింగ్ కార్పొరేషన్ (బీబీసీ) స్వరంగా పనిచేసిన ఆయన గత రాత్రి స్ట్రోక్ రావడంతో ఢిల్లీలోని ఓ ప్రైవేట్ దవాఖానలో చికిత్స పొందుతూ ఆదివారం తుదిశ్వాస విడిచారు. ఆయన వయసు 90 ఏండ్లు.
ఢిల్లీ కేంద్రంగా బ్రిటిష్ కరస్పాండెంట్‌గా 1990ల మధ్య కాలం వరకు ఆయన అనేక రాజకీయ కార్యక్రమాలను కవర్ చేసి చరిత్ర సృష్టించారు. ఆయన బీబీసీ బ్యూరో చీఫ్‌గా 20 ఏండ్ల పాటు వ్యవహరించారు. ఆయన తొమ్మిది పుస్తకాలను కూడా రచించారు. టులీ సేవలకు గుర్తింపుగా కేంద్రం 2005లో పద్మభూషణ్ అవార్డుతో గౌరవించింది.
పాట్నా: రాష్ట్రీయ జనతాదళ్ (ఆర్జేడీ) చీఫ్ లాలూ ప్రసాద్ యాదవ్ చిన్న కుమారుడు, వారసుడు తేజస్వి యాదవ్‌ను ఆదివారం పార్టీ నేషనల్ వర్కింగ్ ప్రెసిడెంట్‌గా ఎన్నుకున్నారు. ఆదివారం జరిగిన పార్టీ జాతీయ కార్యవర్గ సమావేశంలో ఈ ఎన్నిక జరిగింది. ఇటీవల బీహార్‌లో మహాఘట్బంధన్ కూటమి ముఖ్యమంత్రి అభ్యర్థిగా 36 ఏండ్ల తేజస్వియాదవ్ నేతృత్వంలో జరిగిన ఎన్నికల్లో పార్టీ ఘోర ఓటమి తర్వాత ఆయనకు ఈ పదోన్నతి లభించడం గమనార్హం.