ముంబై: రెండు కుటుంబాలకు చెందిన వారు ఇంటి రూఫ్‌పై ఘర్షణ పడ్డారు. ఉన్నట్టుండి ఆ రూఫ్ కూలిపోయింది. దీంతో సుమారు పది మంది కూలిన రూఫ్‌తో పాటు కిందపడ్డారు. (Roof Collapses) అయితే ఎవరూ పెద్దగా గాయపడలేదు. ఈ వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. మహారాష్ట్రలోని థానే జిల్లాలో ఈ సంఘటన జరిగింది. భివాండిలోని దేనేనగర్లో రెండు కుటుంబాల మధ్య వాగ్వాదం జరిగింది. ఫోన్ కాల్లో మాటల దూషణపై మొయినుద్దీన్ నస్రుద్దీన్ షేక్, నస్రుద్దీన్ ఇమాముద్దీన్ షేక్ కుటుంబాల మధ్య గొడవ జరిగింది. వాగ్వాదం ముదరడంతో వారి మధ్య ఘర్షణకు దారి తీసింది.
కాగా, ఇరు కుటుంబాలకు చెందిన సుమారు పది మంది తోసుకుని కొట్టుకునేందుకు ప్రయత్నించారు. ఈ ఘర్షణలో ఆ రూఫ్ ఒక్కసారిగా కుప్పకూలింది. దీంతో వారంతా కింద ఉన్న గదిలో పడిపోయారు. అయితే అదృష్టవశాత్తూ ఎవరికీ తీవ్ర గాయాలు కాలేదు. ఆ ఇల్లు మాత్రం ధ్వంసమైంది. దీంతో ఇంటి యజమానికి నష్ట పరిహారం చెల్లించేందుకు ఆ రెండు కుటుంబాలు అంగీకరించాయి. ఆ తర్వాత ఘర్షణపై స్థానిక పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసుకున్నారు. మరోవైపు కోట్లాట సందర్భంగా వారున్న రూఫ్ కూలిన వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది.
Shocking incident in Bhiwandi! A fight between two families on a rooftop turned disastrous as the floor collapsed, causing several people to fall. All sustained serious injuries. Police are investigating. #Bhiwandi #Accident #ViralVideo pic.twitter.com/U9J41wAw69
— Mayuresh Ganapatye (@mayuganapatye) April 4, 2025