ఘజియాబాద్, జూలై 23: నకిలీ ఫొటోలు, నకిలీ ఐడెంటిటీ కార్డులు చూపిస్తూ ఖరీదైన కార్లు, హంగూ ఆర్భాటాలతో ఏకంగా ఉనికిలో లేని దేశ రాయబార కార్యాలయాన్నే తెరచి పలువురిని మోసగించిన వ్యక్తిని యూపీలోని ఘజియాబాద్‌లో పోలీసులు అరెస్ట్ చేశారు. దౌత్యవేత్త నంబర్ ప్లేట్లు ఉన్న వాహనాలను, నకిలీ దౌత్య పాస్‌పోర్టులను, నకిలీ పాన్‌కార్డులు, వివిధ దేశాల స్టాంప్‌లను స్వాధీ నం చేసుకున్నారు.
కవినగర్ ప్రాంతంలో స్పెషల్ టాస్క్‌ఫోర్స్ పోలీసులు సోమవారం దాడి చేసి హర్షవర్ధన్ జైన్ అనే వ్యక్తిని అరెస్ట్ చేశారు. అంటార్కిటికాలో గుర్తింపు లేని అతి చిన్న పశ్చిమ ఆర్కిటికా దేశానికి చెందిన రాయబారిగా చెప్పుకుంటున్న 45 ఏండ్ల జైన్ ఘజియాబాద్‌లో నకిలీ విదేశీ రాయబారి కార్యాలయాన్ని నడిపి పోలీసులకు చిక్కాడు.