ఒక్క రాత్రి నగ్నంగా పూజలో కూర్చుంటే రూ.30లక్షలు ఇస్తానని యువతిని ఓ వ్యక్తి వేధింపులకు గురిచేశాడు. జ్యోతిష్యుడిని అని చెప్పుకుంటూ అసభ్యకర మెసేజ్లు పంపించాడు. దక్షిణ బెంగళూరులోని రామనగర తాలుకా పెద్దమన్నుగుడ్డెలో చోటుచేసుకుంది.
వివరాల్లోకి వెళ్తే.. కిరణ్ అనే యువకుడు తనను తాను ఓ జ్యోతిష్యుడిని అని.. బెంగలూరులో ప్రత్యేక పూజలు చేస్తుంటానని ఓ యువతిని సంప్రదించాడు. గత నెల 12వ తేదీన సదరు యువతికి కిరణ్ ఫోన్ చేసి.. మనీ డబ్లింగ్ ( డబ్బును రెట్టింపు చేసే) పూజ చేస్తున్నామని.. ఆ పూజ వివరాలను వెల్లడించారు. ఆ పూజలో పాల్గొనేందుకు యువతిని ఎంపిక చేస్తున్నామని.. శరీరంపై పుట్టు మచ్చలు ఉంటే పూజకు పనికిరారు అని వివరించాడు. నిన్ను ఎంపిక చేయాలంటే ముందుగా నగ్నంగా ఉన్న ఫొటో పంపించాలని ఒత్తిడి చేశాడు. పూజ పూర్తయ్యాక రూ.30లక్షలు ఇస్తానని కూడా ప్రలోభపెట్టాడు.
ఈ ఘటనపై బాధితురాలు తన తల్లితో కలిసి రెండు రోజుల క్రితం పోలీసులకు ఫిర్యాదు చేసింది. అయినప్పటికీ ఇంకా నిందితుడిని అరెస్టు చేయలేదని బాధితురాలు ఆవేదన వ్యక్తం చేసింది. ఈ ఘటనపై వెంటనే చర్యలు తీసుకుని.. నిందితుడిని కఠినంగా శిక్షించాలని కోరింది.