Mahua Moitra | విమానంలో కొందరు పురుషులు నన్ను వేధించారు.. ఎక్స్‌లో ఎంపీ మహువా మొయిత్రా పోస్ట్
Mahua Moitra | ఇండిగో ఎయిర్‌లైన్స్ (IndiGo Airlines) కు చెందిన విమానంలో ఢిల్లీ వెళుతున్న తనను అయిదారుగురు పురుషులు వేధించినట్లు తృణమూల్ కాంగ్రెస్ (TMC) ఎంపీ మహువా మొయిత్రా (Mahua Moitra) గురువారం ఆరోపించారు. రక్షణ వ్యవహారాల పార్లమెంటరీ స్థాయీసంఘం సమావేశంలో పాల్గొనేందుకు వెళుతుండగా ఈ ఘటన జరిగినట్లు ఆమె ‘ఎక్స్’లో ఓ పోస్టు పెట్టారు.
Mahua Moitra : ఇండిగో ఎయిర్‌లైన్స్ (IndiGo Airlines) కు చెందిన విమానంలో ఢిల్లీ వెళుతున్న తనను అయిదారుగురు పురుషులు వేధించినట్లు తృణమూల్ కాంగ్రెస్ (TMC) ఎంపీ మహువా మొయిత్రా (Mahua Moitra) గురువారం ఆరోపించారు. రక్షణ వ్యవహారాల పార్లమెంటరీ స్థాయీసంఘం సమావేశంలో పాల్గొనేందుకు వెళుతుండగా ఈ ఘటన జరిగినట్లు ఆమె ‘ఎక్స్’లో ఓ పోస్టు పెట్టారు. అధికారిక విధుల్లో భాగంగా తాను 6E 719 విమానంలో ఢిల్లీకి బయలుదేరా. ఓ గుంపుగా ఎక్కిన అయిదారుగురు పురుషులు నావైపు అసభ్యంగా చూస్తూ వెనుక సీట్లవైపు వెళ్లారు.
విమానం దిగిన తర్వాత తాను డోర్ దగ్గర నిలబడి ఉండగా ఆ వ్యక్తులు హేళన చేస్తూ వీడియో చిత్రీకరించారని మహువా ఆరోపించారు. ఈ మేరకు తన ఎక్స్ పోస్టును పౌరవిమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడికి, ఇండిగో సంస్థకు మహువా జతచేశారు. ఆ వ్యక్తులను గుర్తించి ‘నో ఫ్లై’ జాబితాలో చేర్చాల్సిందిగా ఎయిర్‌లైన్ సంస్థకు ఫిర్యాదుచేశారు. ఈ ఘటనను పెద్దగా పట్టించుకోకుండా తాను సమావేశానికి వెళ్లిపోయానని, తర్వాత కొంతమంది సంఘీలు (రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ కార్యకర్తలు) ఆ వీడియోను వైరల్ చేయడం చూసి ఈ విషయాన్ని బయటపెడుతున్నట్లు తెలిపారు. ‘ఇది బీజేపీ సంస్కృతి’ అంటూ ఆమె దుయ్యబట్టారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
North Korea: బాలిస్టిక్ క్షిపణులను పరీక్షించిన ఉత్తర కొరియా
Aadarsha Kutumbam | ఆదర్శ కుటుంబంలో అదిరిపోయే సర్ప్రైజ్.. వెంకటేష్ అభిమానులకు త్రివిక్రమ్ ట్రీట్!
Road Accident | మద్యం మత్తులో కారు నడిపి స్కూటీని ఢీకొట్టిన యువకుడు.. ముగ్గురు దుర్మరణం..!
Mythri Movie Makers | మైత్రీ మూవీ మేకర్స్ నుంచి మరో రొమాంటిక్ కామెడీ.. డెబ్యూ ఇస్తున్న శ్రీకాంత్ కుమార్తె
IAS Transfers | ఏపీలో పలువురు ఐఏఎస్‌ల బదిలీ.. పర్యాటక శాఖ కార్యదర్శిగా ఆమ్రపాలికి పోస్టింగ్!
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

