బెంగుళూరు: ఎఫ్-35 యుద్ధ విమానం బెంగూళూరు ఏరో ఇండియా షోలో ఎగిరింది. ఇవాళ ఆ ఫైటర్ జెట్ తన స్కిల్స్‌ను ప్రదర్శించింది. యెలహంకా ఎయిర్‌బేస్‌లో ఆ ఫిఫ్త్ జనరేషన్ విమానం తన సత్తా చాటింది. భారత్‌లో ఎఫ్-35 యుద్ధ విమానాలు ఎగరడం ఇదే తొలిసారి. ఎఫ్35 ఫ్లయింగ్ వీడియో ఇదే.
#WATCH | US Air Force's F-35 fighter at Aero India 2023 in Bengaluru pic.twitter.com/4cRLtNHD5D
— ANI (@ANI) February 14, 2023
లాక్‌హీడ్ మార్టిన్‌కు చెందిన అడ్వాన్స్డ్ ఫైటర్ జెట్ ఎఫ్35. ఇది ఫిఫ్త్ జనరేషన్ అమెరికన్ ఎయిర్‌క్రాఫ్ట్. ఏరో షోలో ఎఫ్-35 లైటనింగ్ 2, ఎఫ్-35ఏ వేరియంట్లు దర్శనమిచ్చాయి. ఉటాహ్, అలస్కా వైమానిక స్థావరాల నుంచి ఆ రెండు జెట్లు ఇక్కడకు వచ్చాయి.
ఈ రెండు విమానాలతో పాటు జనరల్ డైనమిక్స్‌కు చెందిన ఎఫ్-16 ఫైటింగ్ ఫాల్కన్, బోయింగ్‌కు చెందిన సూపర్ హార్నెట్లు కూడా బెంగుళూరు ఏరో షోకు వచ్చాయి. ఎఫ్-35 యుద్ధ విమానాలను మూడు వేరియంట్లలో తయారు చేశారు. ఎఫ్-35ఏ, ఎఫ్-35బీ, ఎఫ్-35సీ వేరియంట్లు ఉన్నాయి.
ఎఫ్-35లు సింగిల్ ఇంజిన్ విమానాలు. గ్రౌండ్ టార్గెట్లను ఇవి వైమానిక దాడితో ఈజీగా చేధించగలవు. ఇటీవల రిలీజైన టాప్ గన్ మావరిక్ ఫిల్మ్‌లో ఈ జెట్లకు చెందిన సామర్ధ్యాన్ని ఊహాజనితంగా ప్రదర్శించిన విషయం తెలిసిందే.
ఈ యుద్ధ విమానాల్లో ప్రాట్ అండ్ విట్నీ ఎఫ్135 జెట్ ఇంజిన్ ఇన్స్టాల్ చేశారు. మాక్ 1.6 అంటే ధ్వని వేగం కన్నా 1.6 రెట్ల వేగంతో ఈ విమానం ప్రయాణిస్తుంది. తన స్టీల్త్ సామర్థ్యాన్ని కోల్పోకుండానే.. ఈ యుద్ధ విమానం భారీ ఆయుధ పేలోడ్స్‌ను కూడా మోసుకెళ్లగలదు.
అమెరికాతో పాటు చైనా, రష్యా వద్ద మాత్రమే ఫిఫ్త్ జనరేషన్ ఫైటర్ జెట్లు ఉన్నాయి. మరో వైపు ఇండియా ఏఎంసీఏ జనరేష్ 5 విమానాన్ని డెవలప్ చేస్తున్న విషయం తెలిసిందే.