Constipation | మలబద్దకం సమస్య ఇబ్బందులకు గురి చేస్తుందా..? అయితే వీటిని తినండి..!
ప్రస్తుత కాలంలో మనలో చాలా మందిని వేధిస్తున్న జీర్ణాశయ సంబంధిత సమస్యల్లో మలబద్దకం ఒకటి. వయసుతో సంబంధం లేకుండా ఈ సమస్య అందరినీ బాధిస్తుందని చెప్పవచ్చు. మలబద్దకం సమస్యతో బాధపడే వారిలో మలం గట్టిగా, పొడిగా మారడంతోపాటు మలవిసర్జన సమయంలో తీవ్ర అసౌకర్యం ఉంటుంది.
Constipation | ప్రస్తుత కాలంలో మనలో చాలా మందిని వేధిస్తున్న జీర్ణాశయ సంబంధిత సమస్యల్లో మలబద్దకం ఒకటి. వయసుతో సంబంధం లేకుండా ఈ సమస్య అందరినీ బాధిస్తుందని చెప్పవచ్చు. మలబద్దకం సమస్యతో బాధపడే వారిలో మలం గట్టిగా, పొడిగా మారడంతోపాటు మలవిసర్జన సమయంలో తీవ్ర అసౌకర్యం ఉంటుంది. అలాగే వీరికి ఎప్పుడూ పూర్తిగా పొట్టను ఖాళీచేసిన భావన కూడా కలగదు. జంక్ ఫుడ్ ను ఎక్కువగా తీసుకోవడం, నీటిని తక్కువగా తాగడం, శారీరక శ్రమ లేకపోవడం, ఫైబర్ కలిగిన ఆహారాలను తక్కువగా తీసుకోవడం వంటి వివిధ కారణాల వల్ల మలబద్దకం సమస్య తలెత్తుతుంది. ఈ సమస్య నుండి బయటపడాలంటే ముఖ్యంగా ఫైబర్ కలిగిన ఆహారాలను తీసుకోవాలి. అలాగే ఈ ఫైబర్ లో నీటిలో కరిగేవి, నీటిలో కరగనివి అని రెండు రకాలు ఉంటాయి. ప్రేగు కదలికలను మెరుగుపరచడంతో పాటు మలాన్ని మృదువుగా చేసి విసర్జన సమయంలో కలిగే ఇబ్బందులను తగ్గించడంలో కూడా ఫైబర్ మనకు సహాయపడుతుంది.
ప్రూన్స్..
మలబద్దకం సమస్యతో బాధపడే వారు ఫైబర్ కలిగిన ఆహారాలను తీసుకోవడం వల్ల సమస్య నుండి చాలా త్వరగా బయటపడవచ్చు. మలబద్దకాన్ని తగ్గించే ఫైబర్ కలిగిన ఆహారాల గురించి పోషకాహార నిపుణులు వివరిస్తున్నారు. మలబద్దకంతో బాధపడే వారు ఫ్రూన్స్ ను తీసుకోవడం వల్ల మంచి ఫలితం ఉంటుంది. వీటిని డ్రై ప్లమ్స్ అని కూడా అంటారు. వీటిలో రెండు రకాల ఫైబర్ లు ఉంటాయి. రోజూ గుప్పెడు ప్రూన్స్ తినడం లేదా ఒక గ్లాస్ ప్రూన్స్ రసాన్ని తాగడం వల్ల మలబద్దకం సమస్య నుండి చాలా సులభంగా బయటపడవచ్చు.
మలబద్దకాన్ని తగ్గించడంలో యాపిల్స్ కూడా మనకు ఎంతో సహాయపడతాయి. వీటిలో కూడా రెండు రకాల ఫైబర్ లు ఉంటాయి. ఆపిల్స్ ను తీసుకోవడం వల్ల పేగు కదలికలు మెరుగుపడతాయి. మలబద్దకం సమస్యతో బాధపడే వారు ఆపిల్స్ ను తొక్కతో తీసుకోవడం మంచిది.
బేరి పండ్లు..
బేరి పండ్లను తీసుకోవడం వల్ల కూడా మలబద్దకం తగ్గుతుంది. ఈ పండ్లను పియర్స్ అని కూడా అంటారు. వీటిలో కరిగే ఫైబర్ పుష్కలంగా ఉంటుంది. తాజా బేరి పండ్లను తొక్కతో తీసుకోవడం వల్ల మలబద్దకం సమస్య నుండి చాలా సులభంగా బయటపడవచ్చు.
స్ట్రాబెర్రీ, బ్లూబెర్రీ వంటి బెర్రీ జాతికి చెందిన పండ్లల్లో కూడా ఫైబర్ అధికంగా ఉంటుంది. వీటిని తీసుకోవడం వల్ల మలం ఎక్కువ మొత్తంలో తయారవుతుంది. దీంతో పేగుల్లో ఒత్తిడి ఎక్కువయ్యి మలవిసర్జన సాఫీగా అవుతుంది. మలబద్దకం సమస్య తగ్గుతుంది.
అలాగే మలబద్దకం సమస్యతో బాధపడే వారు చిక్కుళ్లను తీసుకోవడం వల్ల సమస్య నుండి సులభంగా బయటపడవచ్చు. చిక్కుళ్లల్లో కరిగే, కరగని ఫైబర్ లు ఉంటాయి. వీటిని తీసుకోవడం వల్ల పేగు కదలికలు పెరిగి మలవిసర్జన సాఫీగా సాగుతుంది. ఇక తృణ ధాన్యాలను తీసుకోవడం వల్ల కూడా మలబద్దకం సమస్య నుండి బయటపడవచ్చు. వీటిలో కరగని ఫైబర్ లు ఎక్కువగా ఉంటాయి. మలాన్ని మృదువుగా చేయడంలో, జీర్ణక్రియకు మద్దతు ఇవ్వడంలో తృణ ధాన్యాలు ఎంతో సహాయపడతాయి. శుద్ది చేసిన ధాన్యాల కంటే ముడి తృణధాన్యాలను తీసుకోడం వల్లనే అధిక ఫలితాలను పొందవచ్చు.
ఆకుకూరలు..
మలబద్దకంతో బాధపడే వారు ఆకుకూరలను తీసుకోవడం వల్ల మంచి ఫలితం ఉంటుంది. వీటిలో కరగని ఫైబర్ లు అధికంగా ఉంటాయి. ఆహారంలో భాగంగా ఆకుకూరలను తీసుకోవడం వల్ల మొత్తం జీర్ణ ఆరోగ్యానికి మేలు కలుగుతుంది. చియా విత్తనాలను తీసుకోవడం వల్ల కూడా మలబద్దకం సమస్య తగ్గుతుంది. వీటిలో కరిగే, కరగని ఫైబర్ లు రెండు ఉంటాయి. ఇవి పేగు కదలికలను ప్రోత్సహించడంలో సహాయపడతాయి. స్నాక్స్ లాగా లేదా పెరుగు మీద చల్లుకుని వీటిని తీసుకోవడం వల్ల మలబద్దకం తగ్గడంతో పాటు ఆరోగ్యానికి కూడా మేలు కలుగుతుంది. మలబద్దకంతో బాధపడే వారికి చిలగడదుంపలు కూడా ప్రయోజనకరంగా ఉంటాయి. వీటిలో రెండు రకాల ఫైబర్ లు ఉంటాయి. జీర్ణ ఆరోగ్యాన్ని కాపాడడంలో ఇవి మనకు సహాయపడతాయి. ఉడికించిన చిలగడదుంపలను తీసుకోవడం వల్ల మలబద్దకం సమస్య సులభంగా తగ్గుతుంది. అంజీర్ పండ్లల్లో కూడా ఫైబర్ ఎక్కువగా ఉంటుంది. పేగు కదలికలను పెంచడంలో ఇవి మనకు సహాయపడతాయి. తాజా లేదా ఎండిన అంజీర్ పండ్లను తీసుకోవడం వల్ల మలబద్దకం సమస్య నుండి సులభంగా బయటపడవచ్చు.
ఇలా ఫైబర్ ఎక్కువగా ఉండే ఆహారాలను తీసుకుంటూనే నీటిని కూడా ఎక్కువగా తాగాలి. అలాగే తగినంత శారీరక శ్రమ ఉండేలా చూసుకోవాలి. అప్పుడే మలబద్దకం సమస్య నుండి వేగంగా బయటపడవచ్చు. మలబద్దకం సమస్య తీవ్రమయ్యే కొద్ది జీర్ణవ్యవస్థ దెబ్బతింటుంది. ఇది శరీర మొత్తం ఆరోగ్యాన్ని కూడా దెబ్బతీస్తుంది. కనుక మలబద్దకం సమస్యను నిర్లక్ష్యం చేయకుండా తగిన ఆహారాలను తీసుకోవడంతో పాటు వైద్యున్ని సంప్రదించడం కూడా చాలా అవసరం.
Read Today's Latest Health News in Telugu and Telugu News
- Tags
- Constipation
- health tips
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్పై ప్రభావం ఉంటుందా..?

