Maha Kumbh Mela | మహా కుంభ్ నగర్: యూపీలోని ప్రయాగ్రాజ్లో జరుగుతున్న మహా కుంభమేళాను ఈ నెల 28 వరకు పొడిగించే అవకాశాలు కనిపిస్తున్నాయి. ముందుగా నిర్ణయించిన ప్రకారం ఈ మేళా ఈ నెల 26తో ముగియాల్సి ఉంది.
విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం, ఈ మేళాలో విధులను నిర్వహిస్తున్న పోలీసులు, అధికారుల విధులను మరో రెండు రోజులపాటు పొడిగించినట్లు తెలుస్తున్నది. దీనిని బట్టి మేళాను మరో రెండు రోజులు పొడిగిస్తారని భావిస్తున్నారు. ప్రపంచంలో 50 కోట్ల మందికిపైగా పాల్గొన్న మొదటి కార్యక్రమంగా కుంభమేళా రికార్డు సృష్టించింది.