న్యూఢిల్లీ : ఉప్పుడు బియ్యంపై 20 శాతం ఎగుమతి సుంకం వసూలు గడువును కేంద్ర ప్రభుత్వం వచ్చే ఏడాది మార్చి 31 వరకు పొడిగించింది. దేశంలో తగినన్ని నిల్వలు ఉండటంతోపాటు ధరలు అదుపులో ఉండాలన్న లక్ష్యంతో ఆగస్టు 25న దీనిని విధించింది.
ఈ గడువు ఈ నెల 16తో ముగియబోతున్నది. బాస్మతియేతర బియ్యం రకాలన్నిటిపైనా ప్రభుత్వం ఆంక్షలు విధించింది.