Gujarat | భరూచ్ కెమికల్ ఫ్యాక్టరీలో భారీ పేలుడు.. మంటలు వ్యాపించి కార్మికులకు గాయాలు
Gujarat : గుజరాత్లోని ఒక కెమికల్ ఫ్యాక్టరీలో భారీ పేలుడు కారణంగా మంటలు వ్యాపించాయి. దీంతో అనేకమంది కార్మికులు గాయపడ్డట్లు సమాచారం. ఈ ఘటన గుజరాత్, భరూచ్ జిల్లా, ఝగాడియా ప్రాంతంలోని జీఐడీసీ పరిధిలో గురువారం జరిగింది.
Gujarat : గుజరాత్లోని ఒక కెమికల్ ఫ్యాక్టరీలో భారీ పేలుడు కారణంగా మంటలు వ్యాపించాయి. దీంతో అనేకమంది కార్మికులు గాయపడ్డట్లు సమాచారం. ఈ ఘటన గుజరాత్, భరూచ్ జిల్లా, ఝగాడియా ప్రాంతంలోని జీఐడీసీ పరిధిలో గురువారం జరిగింది. స్థానికులు, పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. స్థానిక మెట్రోపాలిటన్ ఎక్సిమ్కెమ్ అనే పరిశ్రమ ఔట్లెట్ వద్ద ఈ ప్రమాదం జరిగింది.
ఇక్కడ ఇతర పరిశ్రమలకు అవసరమయ్యే రసాయనాల్ని భారీగా తయారు చేస్తారు. దేశంలోని కీలక రసాయన పరిశ్రమల్లో ఇదీ ఒకటి. ఈ పరిశ్రమ పరిధిలో ఒక పేలుడు జరిగింది. దీని కారణంగా మంటలు భారీ స్థాయిలో వ్యాపించాయి. ఈ ఘటనలో అనేకమంది కార్మికులు గాయపడ్డారు. దీనిపై సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది, పోలీసులు ఇక్కడికి చేరుకుని సహాయక చర్యలు కొనసాగిస్తున్నారు. గాయపడిన వారిని స్థానిక ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. అగ్నిమాపక వాహనాలు మంటలను ఆర్పేందుకు ప్రయత్నిస్తున్నాయి. పోలీసు ఉన్నతాధికారులు పరిస్థితిని పర్యవేక్షిస్తున్నారు. మంటల కారణంగా చుట్టుపక్కల పొగ భారీగా వ్యాపించింది.
ఈ ప్రమాదం జరిగిన సమయంలో పరిశ్రమలో ఎంత మంది ఉన్నారు అనే విషయాలు ఇంకా తెలియరాలేదు. ఈ ఘటనతో స్తానికులు భయాందోళనకు గురయ్యారు. ఈ ఘటనకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. ఈ ప్రమాదానికి సంబంధించి ఇంకా పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Sai Pallavi | కత్తి పట్టిన సీతగా సాయి పల్లవి.. అదరగొడుతున్న ‘రామాయణం’ కొత్త ప్రోమో!
Kidnap Case | సీజీఎస్టీ రిటైర్డ్ కమిషనర్ కిడ్నాప్.. గంటల్లోనే ఛేదించిన పోలీసులు
Plyometrics | వేగంగా ప్రాచుర్యం పొందుతున్న ప్లయోమెట్రిక్స్ వ్యాయామం.. అంటే ఏమిటి.. ఏం చేయాలి..?
Chaminda Vaas: ఢిల్లీ క్యాపిటల్స్ బౌలింగ్ కోచ్గా చామిండ వాస్
Kavya & Anirudh | పెళ్లి పీటలెక్కబోతున్న కావ్యా మారన్, మ్యూజిక్ డైరెక్టర్ అనిరుధ్!
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్పై ప్రభావం ఉంటుందా..?

