న్యూఢిల్లీ, నవంబర్ 28: ఢిల్లీ ప్రశాంత్ విహార్‌లోని పీవీఆర్ మల్టీఫ్లెక్స్కు సమీపంలో గురువారం ఉదయం స్వల్ప తీవ్రత గల బాంబు పేలింది. దీంతో స్థానికులు, మల్టీప్లెక్స్‌కు వచ్చిన ప్రజలు తీవ్ర ఆందోళనకు గురయ్యారు. పీవీఆర్ మల్టీఫ్లెక్స్కు కొద్ది మీటర్ల దూరంలోనే జరిగిన పేలుడులో ఆటో డ్రైవర్‌కు స్వల్ప గాయాలయ్యాయని ఢిల్లీ పోలీసులు వెల్లడించారు.
ఘటనా స్థలం నుంచి తెల్లటి పౌడర్ లభ్యమైందని, మరిన్ని వివరాల కోసం దర్యాప్తు చేపట్టామని పోలీస్ అధికారి ఒకరు చెప్పారు. ప్రశాంత్ విహార్‌లోని ఇదే ప్రాంతంలో అక్టోబర్ 20న సీఆర్పీఎఫ్ స్కూల్ గోడను ఆనుకొని భారీ పేలుడు ఒకటి సంభవించింది. ఢిల్లీలో శాంతి భద్రతలను కాపాడటంలో కేంద్రం విఫలమైందని ఢిల్లీ సీఎం ఆతిశీ ఆరోపించారు.