చెన్నై: బాణసంచా కర్మాగారంలో భారీ పేలుడు జరిగింది. చాలా దూరం వరకు పేలుడు శబ్దాలు వినిపించాయి. ఆ ప్రాంతమంతా పొగలు దట్టంగా అలముకున్నాయి. ఇది చూసి పరిసర ప్రాంతాల ప్రజలు భయాందోళన చెందారు. (Explosion At Firecracker Factory) తమిళనాడులోని విరుదునగర్ జిల్లాలో ఈ సంఘటన జరిగింది. శివకాశి సమీపంలోని క్రాకర్స్ ఫ్యాక్టరీలో బుధవారం భారీ పేలుడు సంభవించింది. కార్మికులు భయంతో పరుగులు తీశారు. ఏడుగురు కార్మికులు గాయపడినట్లు తెలుస్తున్నది. ప్రాణ నష్టం కూడా జరిగి ఉంటుందని అనుమానిస్తున్నారు.
కాగా, బాణసంచా తయారీ ఫ్యాక్టరీలో మంటలు వ్యాపించడంతో ఆ ప్రాంతమంతా దట్టంగా పొగలు కమ్ముకున్నాయి. ఇది చూసి పరిసర ప్రాంతాల ప్రజలు భయాందోళన చెందారు. ఈ సమాచారం తెలిసిన వెంటనే ఫైర్ సిబ్బంది, రెస్క్యూ బృందాలు అక్కడకు చేరుకున్నారు. సహాయక చర్యలు చేపట్టారు. అక్కడున్న కార్మికులను సురక్షిత ప్రాంతానికి తరలించారు. గాయపడిన కార్మికులను ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ఫైర్ సిబ్బంది మంటలను అదుపు చేశారు. ఈ ప్రమాదానికి సంబంధించిన వీడియో క్లిప్స్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి.
விருதுநகர் மாவட்டம் கோவில் புலிக்குத்தி பகுதியில் இயங்கும் பட்டாசு ஆலையில்
வெடி விபத்து#virudhunagar | #fireaccident | #tamiljanam pic.twitter.com/lSf7EvWYGl— Tamil Janam (@TamilJanamNews) February 5, 2025