న్యూఢిల్లీ, జూన్ 2: దేశంలోని పలు సంస్థలు శనివారం వెలువరించిన ఎగ్జిట్ పోల్స్ ‘బోగస్’ అని కాంగ్రెస్ వ్యాఖ్యానించింది. వీటిని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ‘మోదీ మీడియా పోల్’గా అభివర్ణించారు. వీటిని ఎగ్జిట్ పోల్గా పిలవకూడదు. మోదీ మీదియా పోల్గా వ్యవహరించాలన్నారు. మరోవైపు కొత్త ప్రభుత్వం 100 రోజుల అజెండాపై మోదీ ఆదివారం విస్తృతంగా సమీక్షా సమావేశాలు నిర్వహించడాన్ని కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి జైరాం రమేశ్ తప్పుబట్టారు.
ఎగ్జిట్ పోల్స్‌లో కొన్ని సంస్థలైతే ఆ రాష్ట్రంలో ఉన్న వాస్తవ సీట్ల సంఖ్య కంటే ఎక్కువ కట్టబెట్టాయని అన్నారు. ఎగ్జిట్ పోల్స్‌ను ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ నకిలీవిగా అభివర్ణించగా, అవి వాస్తవాలకు దూరంగా ఉన్నాయని సమాజ్‌వాదీ అధినేత అఖిలేశ్ యాదవ్ అన్నారు.