చండీగఢ్: పలు పార్టీలు మారిన కాంగ్రెస్ మాజీ నేత తిరిగి సొంత గూటికి చేరారు. బీజేపీకి ప్రచారం నిర్వహించిన రెండు గంటల్లోనే ఆయన కాంగ్రెస్ పార్టీ ఎన్నికల సభలో కనిపించారు. రాహుల్ గాంధీ, ఇతర కీలక నేతల సమక్షంలో ఆ పార్టీలోకి తిరిగి చేరారు. హర్యానాలోని సిర్సా మాజీ ఎంపీ అశోక్ తన్వర్ (Ashok Tanwar) గురువారం ఉదయం జింద్ జిల్లాలోని సఫిడాన్లో బీజేపీ అభ్యర్థి తరుఫున ఎన్నికల ప్రచారం నిర్వహించారు. బీజేపీ అభ్యర్థిని గెలిపించాలని కూడా ట్వీట్ చేశారు.
కాగా, హర్యానా అసెంబ్లీ ఎన్నికల ప్రచారం చివరి రోజున మాజీ ఎంపీ అశోక్ తన్వర్ కీలక నిర్ణయం తీసుకున్నారు. గురువారం మహేందర్గఢ్లో జరిగిన కాంగ్రెస్ పార్టీ ఎన్నికల ర్యాలీలో ఆయన పాల్గొన్నారు. కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ, మాజీ సీఎం భూపిందర్ సింగ్ హుడా సమక్షంలో తిరిగి ఆ పార్టీలో చేరారు. అశోక్ తన్వర్ తిరిగి సొంత గూటికి చేరుకున్నారని ఆ ప్రచార సభలో కాంగ్రెస్ నేతలు ప్రకటించారు.
మరోవైపు గతంలో హర్యానా కాంగ్రెస్ అధ్యక్షుడిగా పనిచేసిన అశోక్ తన్వర్ 2019లో పరాజయం తర్వాత ఆ పార్టీకి రాజీనామా చేశారు. 2021 నవంబర్లో తృణమూల్ కాంగ్రెస్ (టీఎంసీ)లో చేరారు. ఆ తర్వాత 2022 ఏప్రిల్లో ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్)లోకి మారారు. 2024 ప్రారంభంలో బీజేపీలో చేరారు. లోక్సభ ఎన్నికల్లో సిర్సా నుంచి పోటీ చేసిన ఆయన కాంగ్రెస్ అభ్యర్థిని కుమారి సెల్జా చేతిలో ఓడిపోయారు. అయితే హర్యానా ఎన్నికల ప్రచారానికి చివరి రోజైన గురువారం అనూహ్యంగా తిరిగి కాంగ్రెస్లోకి చేరారు. అక్టోబర్ 5న హర్యానా అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ జరుగనున్నది. అక్టోబర్ 8న కౌంటింగ్ నిర్వహించి ఫలితాలు వెల్లడిస్తారు.
कांग्रेस ने लगातार शोषितों, वंचितों के हक़ की आवाज़ उठाई है और संविधान की रक्षा के लिए पूरी ईमानदारी से लड़ाई लड़ी है।
हमारे इस संघर्ष और समर्पण से प्रभावित होकर आज BJP के वरिष्ठ नेता, पूर्व सांसद, हरियाणा में BJP की कैंपेन कमेटी के सदस्य और स्टार प्रचारक श्री अशोक तंवर… pic.twitter.com/DynuJEleSE
— Congress (@INCIndia) October 3, 2024