చండీగఢ్: కాంగ్రెస్ మాజీ ఎమ్మెల్యే ఆనంద్ సింగ్ డాంగి తనను కొట్టడంతో పాటు చొక్కా చించినట్లు హర్యానాకు చెందిన జనసేవక్ పార్టీ అభ్యర్థి బాల్‌రాజ్ కుందూ ఆరోపించారు. తన అనుచరుడిపై కూడా ఆయన దాడి చేశాడని విమర్శించారు. (Haryana Polls) రోహ్తక్ జిల్లాలోని పోలింగ్ బూత్ వద్ద ఈ సంఘటన జరిగినట్లు తెలిపారు. మెహమ్ అసెంబ్లీ నియోజకవర్గం ఎమ్మెల్యే అయిన బాల్‌రాజ్ కుందూ జనసేవక్ పార్టీ అభ్యర్థిగా ఆ స్థానం నుంచి తిరిగి పోటీ చేస్తున్నారు.
కాగా, శనివారం పోలింగ్ నేపథ్యంలో తన నియోజకవర్గంలోని పోలింగ్ బూత్ నంబర్ 134ను సందర్శించినట్లు బాల్‌రాజ్ కుందూ తెలిపారు. ఈ సందర్భంగా మెహమ్ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి మూడు సార్లు ఎన్నికైన కాంగ్రెస్ మాజీ ఎమ్మెల్యే ఆనంద్ సింగ్ డాంగి తనను కొట్టడంతోపాటు తన దుస్తులను చించాడని, తన వ్యక్తిగత సహాయకుడిపై కూడా దాడి చేసినట్లు ఆరోపించారు. మెహమ్ అసెంబ్లీ స్థానం నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేస్తున్న ఆయన కుమారుడు బలరామ్ డాంగి ఓడిపోతాడని భావించి తనపై దాడికి పాల్పడినట్లు విమర్శించారు. బాల్‌రాజ్ ఈ మేరకు ఒక వీడియో సందేశాన్ని విడుదల చేశారు. ఓటర్లు ప్రశాంతంగా ఉండాలని , శాంత్రి భద్రతలు కాపాడాలని ఆయన కోరారు.
మరోవైపు 2019 అసెంబ్లీ ఎన్నికల్లో మెహమ్ నియోజకవర్గం నుంచి స్వతంత్ర అభ్యర్థిగా బాల్‌రాజ్ కుందూ గెలిచారు. ఆ నియోజకవర్గం ఎమ్మెల్యే అయిన ఆయన జన్ సేవక్ పార్టీ అభ్యర్థిగా బరిలో ఉన్నారు. కాంగ్రెస్ అభ్యర్థి బలరామ్ డాంగి, బీజేపీ అభ్యర్థి దీపక్ హుడాతో పోటీ పడుతున్నారు.
హర్యానాలోని మొత్తం 90 అసెంబ్లీ స్థానాలకు శనివారం పోలింగ్ నిర్వహించారు. అక్టోబర్ 8న హర్యానాతోపాటు జమ్ముకశ్మీర్‌కు కౌంటింగ్ నిర్వహించి ఫలితాలు ప్రకటిస్తారు.
VIDEO | Haryana Election 2024: Independent candidate from #Meham Assembly constituency Balraj Kundu alleges that he and his PA were beaten up by former Congress MLA Anand Singh Dangi and his supporters outside a polling booth. Dangi’s son Balram Dangi is contesting from Meham… pic.twitter.com/tuS94ZPdOk
— Press Trust of India (@PTI_News) October 5, 2024