శివమొగ్గ: కరెంటు కోతలు, లోడ్ షెడ్డింగ్‌తో కర్ణాటక రైతులు కష్టాలు ఎదుర్కొంటున్నారని ఆ రాష్ట్ర మాజీ సీఎం యెడియూరప్ప అన్నారు. ఇప్పటికే రాష్ట్రంలో కరువు పరిస్థితులు నెలకొన్న నేపథ్యంలో ప్రభుత్వం వెంటనే సమస్య పరిష్కారానికి తగిన చర్యలు తీసుకోవాలని కోరారు.
కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యాలపై త్వరలోనే యాత్ర నిర్వహిస్తానని చెప్పారు. ‘ప్రతి ఒక్కరూ కరెంటు కోతల షాక్‌ను ఎదుర్కొంటున్నారు. కనీసం 3-4 గంటలు కూడా ప్రభుత్వం కరెంటు సరఫరా చేయలేకపోతున్నది’ అని కర్ణాటక మాజీ సీఎం యెడియూరప్ప తెలిపారు.