Ayodhya Ram Mandir | రామయ్య నుదుట సూర్య తిలకం.. ఏటా శ్రీరామ నవమినాడు సూర్య కిరణాలు పడేలా ప్రత్యేక వ్యవస్థ
ఏటా శ్రీరామనవమినాడు అయోధ్యలో రాముడి నుదుటపై సూర్య కిరణాలు ప్రసరించేలా ఆలయ నిర్మాణం జరుపుకుంటున్నది.
Ayodhya Ram Mandir | న్యూఢిల్లీ: ఏటా శ్రీరామనవమినాడు అయోధ్యలో రాముడి నుదుటపై సూర్య కిరణాలు ప్రసరించేలా ఆలయ నిర్మాణం జరుపుకుంటున్నది. రామ నవమి రోజున మధ్యాహ్నం 12 గంటలకు మొదలై 6 నిమిషాలపాటు సూర్య కిరణాలు గర్భగుడిలోని శ్రీరాముడి విగ్రహం నుదిటిపై ప్రసరించేలా సీఎస్ఐఆర్కు చెందిన ‘సెంట్రల్ బిల్డింగ్ రిసెర్చ్ ఇనిస్టిట్యూట్’ (సీబీఆర్ఐ) సైంటిస్టులు ప్రత్యేక వ్యవస్థను ఏర్పాటుచేశారు. పాణిగ్రాహి నేతృత్వంలోని బృందం ఈ వ్యవస్థకు రూపకల్పన చేసింది.
సీబీఆర్ఐ సైంటిస్టు ఆర్ ధర్మరాజు మాట్లాడుతూ, ‘సూర్య కిరణాలు మూడో అంతస్తుపై ఉండే శిఖరం నుంచి గర్భగుడిలోని విగ్రహంపై ప్రసరిస్తాయి. ఆలయం నిర్మాణం పూర్తయిన తర్వాతే ‘సూర్య తిలకం’ ఆవిష్కృతం అవుతుంది’ అని చెప్పారు. ‘ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఆస్ట్రోఫిజిక్స్’ నుంచి సీబీఆర్ఐ సైంటిస్టులు సాయం తీసుకున్నారు. కావాల్సిన వస్తువులను, పరికరాలను బెంగళూరు కేంద్రంగా పనిచేస్తున్న ‘ఆప్టిక్’ సంస్థ తయారుచేసింది.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
LOC | సరిహద్దు రేఖ వద్ద పేలిన ఐఈడీ.. లష్కరే తొయిబా కీలక నేత సహా నలుగురు హతం..!
Yaba Tablets | అస్సాంలో రూ.10 కోట్ల విలువైన డ్రగ్స్ పట్టివేత..!
Bharat Rice | రక్షణ దళాల కోసం ‘భారత్ రైస్’.. ఎఫ్‌సీఐతో ఆర్మీ ఒప్పందం
Ganja Chocolates | కరీంనగర్ జిల్లాలో గంజాయి చాక్లెట్స్ కలకలం
Rahul Gandhi | ఓట్ల దొంగతనంలో సీఈసీ ప్రధాన నేరస్థుడు కాదు : రాహుల్‌గాంధీ
ట్రెండింగ్ వార్తలు
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?

