మైసూరు: కర్ణాటకలో ముఖ్యమంత్రి పీఠం కోసం కాంగ్రెస్లో జరుగుతున్న అంతర్గత పోరు మరోసారి బట్టబయలైంది. కర్ణాటక హోం మంత్రి జీ పరమేశ్వర ముఖ్యమంత్రి పదవి రేసులో తాను కూడా ఉన్నానని పరోక్షంగా ప్రకటించేందుకు బల ప్రదర్శన నిర్వహించారు. ఆయన జన్మదినాన్ని పురస్కరించుకుని పార్టీ కార్యకర్తలు, అభిమానులు భారీ స్థాయిలో సన్మానాన్ని సోమవారం మైసూరులో నిర్వహించారు.
భారీ కటౌట్లు ఏర్పాటు చేసి సీఎం.. సీఎం అన్న నినాదాలతో తమ కార్యక్రమ ఉద్దేశాన్ని బయటపెట్టారు. పరమోత్సవ పేరిట నిర్వహించిన ఈ కార్యక్రమంలో స్వామీజీలు, దళిత నాయకులు, పలువురు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు, భారీగా అభిమానులు పాల్గొన్నారు.