Mamata Banerjee: అసెంబ్లీని గవర్నర్ రద్దు చేసినా.. సీఎంగానే మమతా బెనర్జీ ఎక్స్ ప్రొఫైల్
Mamata Banerjee: పశ్చిమ బెంగాల్ శాసనసభను గవర్నర్ ఆర్ఎన్ రవి రద్దు చేశారు. అయినా కానీ మమతా బెనర్జీ మాత్రం తన సోషల్ మీడియా ప్రొఫైల్లో సీఎంగా కొనసాగుతున్నారు. ఎక్స్ అకౌంట్లో తన హోదాను మార్చలేదు.
కోల్కతా: పశ్చిమ బెంగాల్ శాసనసభను ఆ రాష్ట్ర గవర్నర్ ఆర్ఎన్ రవి గురువారం రద్దు చేశారు. దీని అర్థం తృణమూల్ కాంగ్రెస్ చీఫ్ మమతా బెనర్జీ(Mamata Banerjee) ఇకపై ముఖ్యమంత్రి కాదు. తాజా ఎన్నికల్లో ఆమె ఎక్కడా విజయం సాధించ లేదు కాబట్టి కనీసం ఆమె ఎమ్మెల్యే కూడా కాదు. భారత రాజ్యాంగం ఆర్టికల్ 172లోని 2వ క్లాజ్ ప్రకారం శాసనసభ రద్దును మే 7వ తేదీ నుంచి అమలు చేసినట్టు గవర్నర్ ఒక ప్రకటనలో తెలిపారు. బెంగాల్ సర్కారును రద్దు చేసినా.. మమతా బెనర్జీ మాత్రం తన సోషల్ మీడియా అకౌంట్లో ముఖ్యమంత్రి టైటిల్ పెట్టుకున్నారు.
సీఎం పదవికి రాజీనామా చేసేది లేదని ఇటీవల దీదీ భీష్మించిన విషయం తెలిసిందే. మమతా బెనర్జీ అఫిషియల్ ఎక్స్ అకౌంట్ ప్రొఫైల్లో ఆల్ ఇండియా తృణమూల్ కాంగ్రెస్ ఫౌండర్ చైర్పర్సన్, హానరబుల్ చీఫ్ మినిస్టర్, వెస్ట్ బెంగాల్ అని ఇంకా రాసి ఉన్నది. ఈవీఎంల ట్యాంపరింగ్, ఓట్ల లూటీ ద్వారా బీజేపీ ఈ ఎన్నికల్లో అక్రమంగా, అనైతికంగా గెలిచిందని, తనకు న్యాయం జరిగే వరకు పదవి నుంచి దిగనంటూ మమతా బెనర్జీ భీష్మించుకుని కూర్చోవడంతో గవర్నర్ ఆ రాష్ట్ర శాసనసభను రద్దు చేశారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Ramayana | ‘రామాయణ’ రన్టైమ్ 3 గంటల 15 నిమిషాలా .. సినిమా నిడివిపై ఆసక్తికర ప్రచారం!
Jailer 2 | ‘జైలర్ 2’పై తెలుగు ప్రేక్షకుల అసంతృప్తి.. ప్రమోషన్లు లేవు, బాలయ్య క్యామియో కూడా మిస్సింగ్!
దళిత యువకుడికి అవమానం.. ఆలయంలోకి వెళ్లినందుకు దూషణలు
Goutham Raju | నా ఆరోగ్యంపై తప్పుడు ప్రచారం చేయోద్దు.. ఆ వార్తలపై సీనియర్ నటుడు గౌతం రాజు ఆవేదన!
Singareni | బీఆర్ఎస్ పాలన సింగరేణికి స్వర్ణయుగం.. ఉత్పత్తి, ఆదాయం, లాభాల్లో గణనీయ వృద్ధి!
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్పై ప్రభావం ఉంటుందా..?

