బెంగళూరు: ఆర్థిక సంక్షోభం నేపథ్యంలో స్వీడెన్కు చెందిన టెలికం పరికరాల తయారీ సంస్థ ఎరిక్సన్ 8,500 మంది ఉద్యోగులను తొలగిస్తున్నట్టు ప్రకటించింది. వీరికి ఇప్పటికే మెమోలు జారీచేసింది.
జర్మనీకి చెందిన టెక్నాలజీ సంస్థ ‘సాప్’.. భారత్‌లో 300 మంది ఉద్యోగులకు లేఆఫ్‌లు ప్రకటించింది. వీరంతా బెంగళూరు, గురుగావ్‌లో పనిచేసేవారు. మరోవైపు నిర్వహణ ఖర్చును తగ్గించుకొనేందుకు ఒకే డెస్క్‌ను ఇద్దరు ఉద్యోగులకు ఇవ్వాలని గూగుల్ నిర్ణయించింది.
మూన్‌లైటింగ్‌కు ఇన్ఫోసిస్ వ్యతిరేకం. ఉద్యోగులు దీనికి దూరంగా ఉండాలి. యువ ఉద్యోగులు ఇక నుంచి వర్క్ ఫ్రం హోమ్‌కు స్వస్తి పలికి వర్క్ ఫ్రం ఆఫీస్‌ను ఎంచుకోవాలి.
– ఇన్ఫోసిస్ సహవ్యవస్థాపకుడు, ఎన్ఆర్ నారాయణ మూర్తి