(స్పెషల్ టాస్క్ బ్యూరో)హైదరాబాద్, అక్టోబరు 22 (నమస్తే తెలంగాణ): రాజస్థాన్ శాసనసభ ఎన్నికల్లో ఈస్ట్రర్న్ రాజస్థాన్ కెనాల్ ప్రాజెక్ట్(ఈఆర్సీపీ) ప్రచారాస్త్రంగా మారింది. 19 జిల్లాల్లోని 2.8 లక్షల ఎకరాలకు సాగు నీటిని అందించే ఈ ప్రాజెక్టుకు కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం జాతీయ హోదా ఇవ్వడం లేదని కాంగ్రెస్ నేతలు ఆరోపిస్తున్నారు. తాము రాష్ట్ర బడ్జెట్లో నిధులను కేటాయించామని చెప్తున్నారు. రాష్ట్రంపై బీజేపీ వివక్ష చూపుతున్నదని ప్రచారం చేస్తున్నారు. దీనిపై కేంద్ర మంత్రులు, బీజేపీ నేతలు స్పందిస్తూ, రాష్ట్ర ప్రభుత్వం ఈ ప్రాజెక్టుకు సంబంధించిన ప్రతిపాదనలను పంపించలేదని, ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాట్ ప్రభుత్వానికి చిత్తశుద్ధి లేదని ఆరోపిస్తున్నారు.