చెన్నై, జూలై 18 : వచ్చే ఏడాది జరిగే తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో అన్నాడీఎంకే నేతృత్వంలోని ఎన్డీఏ కూటమి గెలిస్తే తమ పార్టీ ప్రభుత్వంలో భాగమవుతుందని హోం మంత్రి అమిత్ షా చేసిన ప్రకటనపై అన్నాడీఎంకే విభిన్నంగా స్పందించడంపై బీజేపీ మాజీ అధ్యక్షుడు కే అన్నామలై వివరణ ఇచ్చారు.
ఈ విషయంలో ద్రవిడయన్ పార్టీకి ఏదన్నా సందేహాలు ఉంటే దానిని నేరుగా అమిత్ షా నుంచి తీర్చుకోవాలని అన్నారు. అన్నాడీఎంకేతో బీజేపీ పొత్తు దీర్ఘకాలంలో పార్టీకి ప్రయోజనం కాదని వాదిస్తూ వస్తున్న అన్నామలై.. రెండు పార్టీలు కూటమిగా పోటీ చేస్తే బీజేపీ భాగస్వామ్యం ఎక్కువగా ఉండాలని అభిప్రాయపడుతున్నారు.