న్యూఢిల్లీ: ఈపీఎఫ్‌వో వడ్డీ రేటును తగ్గించింది. 2021-22 సంవత్సరానికి వడ్డీ రేటును 8.5 శాతం నుంచి 8.1 శాతానికి తగ్గించినట్లు తెలుస్తోంది. పీటీఐ వార్తా సంస్థ దీనికి సంబంధించిన ప్రకటన చేసింది. ఈపీఎఫ్ డిపాజిట్లపై ఈ ఏడాదికి ఇంట్రెస్ట్ రేటును 8.1 శాతంగా ఫిక్స్ చేసినట్లు ప్రభుత్వ వర్గాలు వెల్లడించాయి. 1977 -78 తర్వాత ఇదే అత్యల్ప వడ్డీ రేటు. ఈపీఎఫ్‌వోలో ప్రస్తుతం అయిదు కోట్ల మంది వినియోగదారులు ఉన్నారు. గువహతిలో జరిగిన ఈపీఎఫ్‌వో సెంట్రల్ బోర్డు ట్రస్టీల సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నారు.