న్యూఢిల్లీ: సెప్టెంబర్ 2014కు ముందు రిటైర్ అయిన అర్హులైన పెన్షనర్లు అధిక పెన్షన్ కోరుతూ దరఖాస్తు చేసుకునేందుకు గడువును మే 3 వరకూ పొడిగించినట్టు కేంద్ర కార్మిక శాఖ సోమవారం తెలిపింది.
వీరికి 2023 మార్చి 3తో గడువు ముగియగా, ఉద్యోగులు, అసోసియేషన్ల నుంచి వస్తున్న డిమాండ్ల దృష్ట్యా కేంద్ర ట్రస్టీల బోర్డు చైర్మన్ ఈ ఏడాది మే 3 వరకూ గడువు పొడిగించినట్టు తెలిపింది. 2014 సెప్టెంబర్ తర్వాత ఉద్యోగంలో కొనసాగిన వారికి అధిక పెన్షన్‌కు దరఖాస్తు గడువు కూడా మే 3 అన్న సంగతి తెలిసిందే.