న్యూఢిల్లీ, ఏప్రిల్ 30: ఉద్యోగ భవిష్య నిధి(ఈపీఎఫ్) చందాదారులు త్వరలో భారీ మార్పులను చూడనున్నారు. కనీస పింఛన్లో భారీ పెంపును ప్రభుత్వం పరిశీలిస్తుండగా ఏటీఎం విత్‌డ్రాయల్స్‌ను అనుమతించేందుకు ఈపీఎఫ్‌వో కృషి చేస్తున్నది. ప్రస్తుతం కనీస పింఛన్ రూ. 1,000 ఉండగా దీన్ని రూ. 7,500 వరకు పెంచవచ్చని ప్రభుత్వ వర్గాలు వెల్లడించాయి.
ఈ పెంపు కోసం డిమాండ్ ఊపందుకుంటున్నది. కార్మిక సంఘాలు సవరణ కోసం గట్టిగా ఒత్తి డి చేస్తున్నాయి. పింఛన్ మొత్తాన్ని పెం చాలని పార్లమెంటరీ కమిటీ కూడా సిఫార్సు చేసింది. త్వరలో తుది నిర్ణయం వెలువడే అవకాశం ఉంది.