న్యూఢిల్లీ, జూలై 6 : గత ఆర్థిక సంవత్సరానికి (2025-26)గాను ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ (ఈపీఎఫ్వో) 8.25 శాతం వడ్డీరేటును అధికారికంగా ప్రకటించింది. ఈ మేరకు వడ్డీ మొత్తాన్ని ఉద్యోగుల పీఎఫ్ ఖాతాల్లో జమ చేయాలని తాజాగా ఫీల్డ్ ఆఫీసులకు సూచించింది.
దీంతో 8 కోట్ల మంది ఖాతాదారులకు లబ్ధి చేకూరనున్నది. ఈ వడ్డీరేటును గత నెలలోనే కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ ద్వారా ప్రభుత్వం ఆమోదించిన విషయం తెలిసిందే. ఇక అంతకుముందే వరుసగా మూడో ఏడాదీ 8.25 శాతం వడ్డీరేటునే చెల్లించాలని సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ట్రస్టీస్ నిర్ణయించిన సంగతి విదితమే.