Helath Tips : అత్యవసర విటమిన్లు, మినరల్స్, ఫైబర్, ప్రొటీన్ కలిగిఉండి అధిక క్యాలరీలు లేని స్నాక్స్‌ను బయటకు వెళ్లినప్పుడు తీసుకోవడం ఆరోగ్యానికి మేలు చేస్తుంది. ఆకలిని నియంత్రించి అతిగా తినకుండా ఉండేందుకు, బరువు పెరగకుండా ఉండేందుకు ఈ స్నాక్స్ ఉపకరిస్తాయి. సమతులాహారం ద్వారా శరీర ఆరోగ్యానికీ మేలు చేస్తాయి.
ఆధునిక బిజీ జీవితాల్లో ఎక్కువ సమయం ఆహారం తయారుచేసుకునే అవకాశం ఉండకపోవడంతో ఈ తరహా లో క్యాలరీ స్నాక్స్ నిరభ్యంతరంగా తీసుకోవచ్చు. ఇక లో క్యాలరీ డైట్లో భాగంగా ఆల్మండ్ బటర్‌తో పాటు యాపిల్ ముక్కలను తీసుకోవడం ఆరోగ్యకరమైన స్నాక్స్ అని పోషకాహార నిపుణులు సూచిస్తున్నారు. ఆల్మండ్ బటర్ ఆరోగ్యకర కొవ్వులు, ప్రొటీన్‌ను కలిగిఉండి తక్కువ క్యాలరీల్లోనే కావాల్సిన ఎనర్జీని, ఉత్సాహాన్ని అందిస్తుంది.
యాపిల్‌లో ఉండే సహజసిద్ధమైన చక్కెర, ఆల్మండ్ బటర్లో ఉండే ప్రొటీన్ తక్షణ శక్తిని అందిస్తాయి. ఇక పెరుగులో బెర్రీస్‌ను కలిపి తీసుకోవడం హెల్ధీ స్నాక్స్‌గా చెబుతున్నారు. తక్కువ క్యాలరీలతో పాటు యాంటీఆక్సిడెంట్లు, ఫైబర్ అధికంగా ఉండే బెర్రీస్‌ను తీసుకోవడం ద్వారా శరీరానికి అవసరమైన అత్యవసర పోషకాలు అందుతాయి. ఇక లో క్యాలరీ స్నాక్స్‌గా వేటిని తీసుకోవచ్చో చూద్దాం..
ఆల్మండ్ బటర్‌తో యాపిల్ స్లైస్‌లు
బెర్రీస్‌తో గ్రీక్ యోగర్ట్
పాప్‌కార్న్
పైనాపిల్‌తో చీజ్
బాయిల్డ్ ఎగ్స్
చెర్రీ టమోటాలు
క్యారట్, కుకుంబర్
అవకాడో రైస్ కేక్స్
Read More :