Monkeys Shot Dead | 17 కోతులను కాల్చి చంపడంపై కలకలం.. అటవీ శాఖ దర్యాప్తు
Monkeys Shot Dead | ఒక గ్రామంలో కోతుల బెడదను నివారించేందుకు ఏకంగా వాటిని కాల్చి చంపారు. సుమారు 17 కోతులు కాల్పుల్లో మరణించాయి. మరికొన్ని తీవ్రంగా గాయపడ్డాయి. ఈ విషయం తెలిసిన అటవీ శాఖ అధికారులు దర్యాప్తు చేపట్టారు.
రాయ్పూర్: ఒక గ్రామంలో కోతుల బెడదను నివారించేందుకు ఏకంగా వాటిని కాల్చి చంపారు. (Monkeys Shot Dead) సుమారు 17 కోతులు కాల్పుల్లో మరణించాయి. మరికొన్ని తీవ్రంగా గాయపడ్డాయి. ఈ విషయం తెలిసిన అటవీ శాఖ అధికారులు దర్యాప్తు చేపట్టారు. ఛత్తీస్గఢ్లోని బెమెతర జిల్లాలో ఈ సంఘటన జరిగింది. బెల్గావ్ గ్రామంలో కోతులు ఇళ్లలోకి ప్రవేశించి ప్రజలకు ఇబ్బంది కలిగిస్తున్నాయి. అలాగే పంటలను నాశనం చేస్తున్నాయి. దీంతో ఆ గ్రామంలో ఇటీవల ఒక సమావేశాన్ని నిర్వహించారు. కోతులను తరిమేందుకు ఇద్దరు కూలీలను నియమించారు.
కాగా, గతంలో కర్రలతో కోతులను బెదరకొట్టి గ్రామం నుంచి తరిమేవారు. అయితే ఈసారి కోతులను తరిమేందుకు నియమించిన వ్యక్తులు తుపాకులు వినియోగించినట్లు గ్రామస్తులు తెలిపారు. ఆగస్ట్ 28న కోతులపై కాల్పులు జరిపి వాటిని చంపినట్లు ఆరోపించారు. సుమారు 17 కోతులు ఈ కాల్పుల్లో మరణించగా మరికొన్ని గాయపడ్డాయని తెలిపారు. దీనిపై కొందరు గ్రామస్తులు ఆగ్రహం వ్యక్తం చేశారు. అటవీ శాఖ అధికారులకు ఫిర్యాదు చేశారు.
మరోవైపు మరణించిన కోతుల కుళ్లిన కళేబరాలను అటవీ శాఖ సిబ్బంది స్వాధీనం చేసుకున్నారు. కొందరు అనుమానితులను ప్రశ్నించారు. అయితే కాల్పులు జరిపి కోతులను చంపారన్న వాదనలను అటవీ శాఖ అధికారి ఖండించారు. కోతుల మరణానికి ఖచ్చితమైన కారణం ఇంకా తెలియలేదని అన్నారు. దీనిపై దర్యాప్తు చేస్తున్నట్లు వెల్లడించారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Pakistan School: పాకిస్థాన్ స్కూల్లో కూలిన పైకప్పు.. 28 మంది విద్యార్థులు మృతి
Abhijeet Dipke: సీజేపీకి అమెరికా నిధులు.. సింగర్ మిల్బెన్కు దీప్కే కౌంటర్
Konda Surekha | వరంగల్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ పర్యవేక్షణకు మాజీ మంత్రి కొండా సురేఖ దూరం
Harish Rao | ఎల్నినో, కొవిడ్ లాంటి విపత్తుల కంటే ప్రమాదకరం కాంగ్రెస్ పాలన : హరీశ్ రావు
The Greatest Trailer | బాక్సింగ్ దిగ్గజం మొహమ్మద్ అలీ బయోపిక్.. ‘ది గ్రేటెస్ట్’ ట్రైలర్ విడుదల
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్పై ప్రభావం ఉంటుందా..?

