Engineer Rashid : ఉగ్రవాదులకు సహకరించిన కేసులో అరెస్టై జైల్లో ఉన్న ఆవామీ ఇత్తేహద్ పార్టీ (AIP) అధ్యక్షుడు, జమ్ముకశ్మీర్ (Jammu and Kashmir) లోని బారాముల్లా (Baramulla) లోక్‌సభ (Lok Sabha) నియోజకవర్గ ఎంపీ ఇంజినీర్ రషీద్ (Engineer Rashid).. మధ్యంతర బెయిల్ కోసం ఢిల్లీ కోర్టు (Delhi court) ను ఆశ్రయించారు. ఆ మేరకు ఆయన కోర్టుకు దరఖాస్తు పెట్టుకున్నారు.
ప్రస్తుతం పార్లమెంట్ శీతాకాల సమావేశాలు జరుగుతున్నాయని, ఆ సమావేశాల్లో పాల్గొని నా నియోజకవర్గ ప్రజల సమస్యలపై మాట్లాడటం కోసం తనకు బెయిల్ మంజూరు చేయాలని రషీద్ తన దరఖాస్తులో కోరారు. గత పార్లమెంట్ సమావేశాలకు కూడా తనకు బెయిల్ ఇవ్వలేదని ఆయన గుర్తుచేశారు. అయితే రషీద్ ప్రస్తుతం జైల్లో నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ (NIA) జ్యుడీషియల్ కస్టడీలో ఉన్నందున కోర్టు ఆ సంస్థ వివరణ కోరింది.
ఇంజినీర్ రషీద్‌కు బెయిల్ మంజూరు విషయమై అభిప్రాయాన్ని తెలియజేయాలంటూ ఢిల్లీలోని పటియాలా హౌస్ కోర్టుకు చెందిన పిన్సిపల్ డిస్ట్రిక్ట్ సెషన్స్ జడ్జి NIAకు నోటీసులు ఇచ్చారు. పిటిషన్‌పై తదుపరి విచారణను నవంబర్ 27కు వాయిదా వేశారు. వీడియో కాన్ఫరెన్స్ ద్వారా బెయిల్ కోసం దరఖాస్తు చేసుకున్న రషీద్.. బెయిల్ కోసం చేతులు జోడించి అభ్యర్థిస్తున్నానని తన దరఖాస్తులో పేర్కొన్నారు.