న్యూఢిల్లీ: ఢిల్లీలోని రోహిణిలో మంగళవారం అర్ధరాత్రి జరిగిన ఎన్కౌంటర్లో బీహార్‌కు చెందిన సిగ్మా గ్యాంగ్‌లోని నలుగురు నేరగాళ్లు హతమయ్యారు. బీహార్, ఢిల్లీ పోలీసులు సంయుక్తంగా ఈ ఆపరేషన్ చేపట్టారు.
బీహార్ శాసనసభ ఎన్నికల్లో భయానక వాతావరణాన్ని సృష్టించేందుకు ఈ ముఠా ప్రయత్నించిందని పోలీసులు తెలిపారు. హత్యలతో పాటు పలు క్రూరమైన నేరాల్లో ఈ ముఠాలోని నలుగురు సభ్యులు నిందితులుగా ఉన్నారని.. తమకు చిక్కకుండా వీరు తప్పించుకుని తిరుగుతున్నారని వెల్లడించారు.