బండిపొరాలో ఉగ్రవాదిని మట్టుబెట్టిన సైన్యం
శ్రీనగర్ : జమ్మూకశ్మీర్లోని బండిపోరాలోని సాలిందర్ అటవీ ప్రాంతంలో జరిగిన ఎన్కౌంటర్లో ఓ ఉగ్రవాది హతమయ్యాడు. ఆ తర్వాత పెద్ద భద్రతా బలగాలు సెర్చ్ ఆపరేషన్ చేపట్టాయి. చొరబాట్ల నేపథ్యంలో సైన్యం అప్రమత్తమైంది. నియంత్రణ రేఖ వెంట భద్రతా ఏర్పాట్లను కట్టుదిట్టం చేసినట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి.
కాగా, హతమైన ఉగ్రవాది నుంచి రైఫిల్, మూడు మ్యాగజైన్ స్వాధీనం చేసుకున్నట్లు కశ్మీర్ ఐజీపీ విజయ్కుమార్ తెలిపారు. ప్రస్తుతం ఉగ్రవాదుల కోసం గాలింపు చర్యలు కొనసాగుతున్నాయని పేర్కొన్నారు. బందిపొరాలోకి ఉగ్రవాదులు చొరబడ్డారనే సమాచారం మేరకు భద్రతా బలగాలు హైఅలర్ట్ ప్రకటించాయి. కోటసత్రి జంగిల్, గుండ్పోరా జంగిల్, యాటు, క్విల్ముకం వంటి ప్రాంతాల్లో ఉగ్రవాదుల కదలికలున్నాయనే సమాచారం మేరకు పెద్ద ఎత్తున ఆపరేషన్లు ప్రారంభించినట్లు అధికారులు తెలిపారు.
పోలీసులు, ఆర్మీ సంయుక్తంగా పలు ప్రాంతాల్లో సెర్చ్ ఆపరేషన్ ప్రారంభించారు. నాలుగు రోజుల కిందట రాజోరిలో నియంత్రణ రేఖ వెంట చొరబాటు దారుడు హతమయ్యాడు. నౌషేరా ప్రాంతంలోని లామ్ సెక్టార్లో చొరబాటుకు యత్నిస్తుండగా ఓ ఉగ్రవాదిని సైన్యం హతమార్చింది. అతని నుంచి ఆయుధాలను స్వాధీనం చేసుకున్నది.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
priest predicted son, shot dead | కొడుకు పుడతాడని జోస్యం చెప్పిన పూజారి.. కుమార్తె జన్మించడంతో ఆయనపై కాల్పులు జరిపి హత్య
Fauzi | దర్శకుడికి గాయం.. ప్రభాస్ ‘ఫౌజీ’ షూటింగ్కు చిన్న బ్రేక్
Tragedy | పండుగ పూట విషాదం.. రోడ్డు ప్రమాదంలో అన్న, చెల్లి దుర్మరణం
Sunitha Lakshma Reddy | తెలంగాణ సంస్కృతికి ప్రతీక బతుకమ్మ పండుగ: మాజీ మంత్రి సునీత లక్ష్మారెడ్డి
Chirumarthi Lingaiah | నిరుద్యోగులను మోసం చేసిన కాంగ్రెస్కు బుద్ది చెప్పాలి : మాజీ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య
ట్రెండింగ్ వార్తలు
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!

