Encounter | ఉత్తర కశ్మీర్ కుప్వారా జిల్లాలోని కెరాన్ సెక్టార్లో భద్రతా భలగాలు, ఉగ్రవాదులకు మధ్య గురువారం ఎదురుకాల్పులు జరిగాయి. కెరాన్ సరిహద్దు ప్రాంతంలోని భారత్-పాకిస్థాన్ నియంత్రణ రేఖ (LAC) సమీపంలో కాల్పులు చోటు చేసుకున్నాయి. ఆర్మీకి చెందిన 6 ఆర్ఆర్, ఎస్ఓజీ సైనికులు, స్థానిక పోలీసులు సంయుక్త ఆపరేషన్లో ఇద్దరు ఉగ్రవాదులను మట్టుబెట్టారు. ప్రతికూల పరిస్థితుల్లో బలగాలు ఉగ్రవాదులను వేటాడుతున్నాయి. స్థానికంగా వర్షాలు కురుస్తున్నాయి. దట్టంగా మేఘాలు, కొండ ప్రాంతాల్లో మంచు కమ్మేసినా బలగాలు ఉగ్రవాదుల కోసం ఇంకా సెర్చ్ ఆపరేషన్ కొనసాగిస్తున్నది.
మరో వైపు దోడాలోనూ ఎన్కౌంటర్ కొనసాగుతున్నది. సోమవారం నుంచి ఉగ్రవాదుల కోసం గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి. నాలుగు రోజులుగా బలగాలు ఉగ్రవాదుల కోసం గాలిస్తున్నా ఇప్పటి వరకు ఆచూకీ దొరకలేదు. దట్టమైన అడవులు, ఎత్తయిన పర్వతాలు, ప్రతికూల వాతావరణం భద్రతా బలగాలకు సవాలుగా నిలుస్తున్నా.. సైనికులు ఏమాత్రం వెనక్కి తగ్గడం లేదు. ఎలాగైనా ఉగ్రవాదులను హతమార్చి ప్రతీకారం తీర్చుకోవాలని కృతనిశ్చయంతో ఉన్నారు. ఉగ్రవాదులను త్వరలోనే అంతమొందిస్తామని అధికారులు స్పష్టం చేశారు.
ఇంకా ఆపరేషన్ కొనసాగుతుందని రాంబన్-దోడా రేంజ్ డీఐజీ శ్రీధర్ పాటిల్ పేర్కొన్నారు. దోడాలోని కస్తిగర్ ప్రాంతంలో తెల్లవారుజామున 2 గంటల సమయంలో జరిగిన ఎన్కౌంటర్లో ఇద్దరు సైనికులు గాయపడ్డారు. ప్రభుత్వాసుపత్రిలో ప్రాథమిక చికిత్స అనంతరం వారిని కమాండ్ ఆస్పత్రికి తరలించారు. ఆ ప్రాంతంలో తనిఖీలు కొనసాగుతున్నాయని అధికారులు తెలిపారు. బుధవారం రాత్రి అనుమానాస్పద కార్యకలాపాలను సైన్యం గుర్తించింది. ఆ తర్వాత వెంటనే భద్రతా బలగాలను రంగంలోకి దించింది. ఈ క్రమంలో ఉగ్రవాదులకు, బలగాలకు మధ్య కాల్పులు చోటు చేసుకున్నాయి. ఈ క్రమంలో ఇద్దరు జవాన్లు గాయపడ్డారు.
#WATCH | J&K: Two Indian Army soldiers injured in an encounter with terrorists in Kastigarh area of Doda. The search operation is underway.
DIG Ramban-Doda Range, Shridhar Patil says, “…I cannot share much details as our search operation is still underway. We will succeed in… pic.twitter.com/eI6jEgDGBK
— ANI (@ANI) July 18, 2024