శ్రీనగర్: జమ్మూకశ్మీరులోని కఠువా జిల్లాలో నాలుగు రోజుల నుంచి జరుగుతున్న యాంటీ టెర్రర్ ఆపరేషన్లో గురువారం ఇద్దరు ఉగ్రవాదులను మట్టుబెట్టారు. ఈ ఎన్కౌంటర్లో ముగ్గురు పోలీసులు వీర మరణం పొందారు.
గాయపడిన ఇద్దరు పోలీసులకు దవాఖానలో చికిత్స జరుగుతున్నది. జఖోలే గ్రామం సమీపంలో ఈ ఎన్కౌంటర్ జరిగింది. ఈ ప్రాంతానికి అదనపు బలగాలను పంపిస్తున్నట్లు అధికారులు తెలిపారు. ఉగ్రవాదులు-భద్రతా దళాల మధ్య కాల్పులు కొనసాగుతున్నాయని చెప్పారు.