కొత్తగూడెం ప్రగతి మైదాన్: ఛత్తీస్గఢ్లో భద్రతా దళాలు, మావోయిస్టులకు మధ్య జరిగిన ఎదురుకాల్పుల్లో ముగ్గురు మావోయిస్టులు మృతిచెందారు. ఈ ఘటన సుక్మా జిల్లా ఏజెన్సీ ప్రాంతంలో గురువారం చోటు చేసుకుంది. సుక్మా ఎస్పీ కిరణ్ చవాన్ కథనం ప్రకారం..
గొల్లపల్లి పోలీస్స్టేషన్ పరిధిలోని అడవుల్లో జిల్లా రిజర్వు గార్డ్స్ (డీఆర్జీ) భద్రతా బలగాలు సెర్చింగ్ జరుపుతుండగా, మావోయిస్టులు తారసపడి జవాన్లపైకి కాల్పులు జరిపారు. ఎదురు కాల్పుల అనంతరం ఘటనా స్థలంలో ముగ్గురు మావోయిస్టుల మృతదేహాలతో పాటు వారికి సంబంధించిన ఆయుధ, వస్తు సామగ్రిని జవాన్లు స్వాధీనం చేసుకున్నారు.