Encounter | ఉత్తర కశ్మీర్లోని బారాముల్ల జిల్లాల్లో చొరబాటు ప్రయత్నాలను భద్రతా బలగాలు తిప్పిట్టాయి. ఉరీలోని గోహ్లాన్ ప్రాంతంలో శనివారం ఉగ్రవాదులు చొరబాటుకు ప్రయత్నించగా.. ఇద్దరిని భద్రతా బలగాలు మట్టుబెట్టాయి. ప్రస్తుతం సంఘటనా స్థలంలో ఇంకా ఉగ్రవాదులు, సైన్యం మధ్య కాల్పులు కొనసాగుతున్నాయి. ప్రస్తుతం ఉగ్రవాదుల ఆచూకీ తెలియరాలేదు. వారిని గుర్తించేందుకు ప్రయత్నిస్తున్నాయి. ఇంతకు ముందు ఈ నెల 21న భద్రతా దళాలు ఎన్కౌంటర్లో ఇద్దరు పాకిస్థానీ ఉగ్రవాదులను హతమార్చాయి. ఇద్దరికీ లష్కరే తోయిబాతో సంబంధాలను ఉన్నట్లుగా గుర్తించారు. ఉత్తర కశ్మీర్లో ఉగ్రవాదాన్ని పెంచేందుకు పాక్ కుట్ర పన్నుతున్నట్లుగా గుర్తించారు.
2005 నుంచి 2015 వరకు ఈ ప్రాంతంలో ఉగ్రవాదం వ్యాపించింది. అయితే, 2019లో జమ్మూ కశ్మీర్ పోలీసుల ప్రచారంలో బారాముల్లా జిల్లాను ఉగ్రవాద రహితంగా ప్రకటించారు. భద్రతా సంస్థల ప్రకారం, స్థానిక ఉగ్రవాదుల కంటే పాకిస్తాన్ మూలాలు ఉన్న విదేశీ ఉగ్రవాదుల సంఖ్య ఇప్పటికీ ఎక్కువగా ఉంది. అయితే, వారిని క్రమంగా నిర్మూలిస్తూ వస్తున్నారు. అమర్నాథ్ యాత్ర కోసం జమ్మూ కశ్మీర్లో పారామిలటరీ బలగాను మోహరించారు. ఈసారి జమ్మూ జిల్లాకు 24 కంపెనీల అదనపు పారామిలటరీ బలగాలను తరలించారు. ఇది గతేడాది కంటే ఐదు నుంచి ఆరు కంపెనీల కంటే ఎక్కువ. అమర్నాథ్ యాత్ర మార్గం, యాత్రికుల బస స్థలాలు, లంగర్లు తదితర ప్రాంతాల్లో మోహరించడంతో పాటు, ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరిగే అవకాశం ఉన్న ప్రాంతాల్లో తొలిసారిగా పారామిలటరీ బలగాలను కేంద్రం మోహరిస్తున్నది.