కొత్తగూడెం ప్రగతి మైదాన్, డిసెంబర్ 4: ఛత్తీస్గఢ్ రాష్ట్రం బీజాపూర్-దంతేవాడ జిల్లా సరిహద్దుల్లో మావోయిస్టులు, భద్రతా దళాలకు బుధవారం జరిగిన ఎదురు కాల్పుల్లో మృతిచెందిన మావోయిస్టుల సంఖ్య 18కి చేరింది. బుధవారం 12 మంది మావోయిస్టులు, ముగ్గురు డీఆర్జీ జవాన్లు మృతి చెందిన విషయం విదితమే.
సాయంత్రం చీకటి పడడంతో గురువారం ఉదయం చేపట్టిన గాలింపు చర్యల్లో ఘటనా స్థలం నుంచి మరో ఆరుగురు మావోయిస్టుల మృతదేహాలను గుర్తించినట్లు పోలీసు అధికారులు పేర్కొన్నారు.