Jammu and Kashmir | జమ్మూ కాశ్మీర్లో ఇద్దరు ఉగ్రవాదులున్నట్లు గుర్తింపు.. కొనసాగుతున్న ఎన్కౌంటర్
Jammu and Kashmir : జమ్మూ కాశ్మీర్లో ఎన్కౌంటర్ కొనసాగుతోంది. భద్రతా బలగాలు, తీవ్రవాదులకు మధ్య శనివారం కాల్పులు జరుగుతున్నాయి.
Jammu and Kashmir : జమ్మూ కాశ్మీర్లో ఎన్కౌంటర్ కొనసాగుతోంది. భద్రతా బలగాలు, తీవ్రవాదులకు మధ్య శనివారం కాల్పులు జరుగుతున్నాయి. రాజౌరి పరిధిలోని డోరిమల్ అటవీ ప్రాంతంలో ఈ ఎన్కౌంటర్ సాగుతోంది. ఈ ప్రాంతంలో కనీసం ఇద్దరు ఉగ్రవాదులు ఉన్నట్లు సమాచారం అందింది.
దీంతో వారిని పట్టుకునేందుకు, అంతం చేసేందుకు భద్రతా బలగాలు రంగంలోకి దిగాయి. ఈ ప్రాంతం మొత్తాన్ని గాలిస్తున్నాయి. తీవ్రవాదుల కదలికలపై స్పష్టమైన సమాచారం అందడంతో పోలీసులు, కేంద్ర బలగాలు రంగంలోకి దిగాయి. సోదాలు నిర్వహిస్తుండగా, తీవ్రవాదులు కాల్పులు జరిపారు. ఈ క్రమంలో పోలీసులు కూడా ఎదురు కాల్పులు జరిపారు. అయితే, ఇంకా ఉగ్రవాదులు చిక్కలేదు. మరోవైపు గత ఫిబ్రవరిలో ఇండియన్ ఆర్మీ ఒక ప్రకటన చేసింది. 326 రోజులు శ్రమించిన తర్వాత కిష్ట్వార్ ప్రాంతంలో తీవ్రవాద నెట్‌వర్క్‌ను అంతం చేశామని ప్రకటించింది.
ఇటీవల ఇండియన్ ఆర్మీ చీఫ్ జనరల్ ఉపేంద్ర ద్వివేది మాట్లాడుతూ.. ఒకవేళ పాకిస్తాన్ ఇలాగే ఉగ్రవాదుల్ని పెంచుకుంటూ, ఇండియాపైకి పంపిస్తే భారత్ తీవ్రంగా స్పందిస్తుందన్నారు. ప్రపంచ పటంలో ఉండాలో లేదో పాకిస్తాన్ తేల్చుకోవాలన్నారు. పాకిస్తాన్‌పై భారత్ చేపట్టిన ఆపరేషన్ సిందూర్‌కు ఏడాది పూర్తైంది. గత ఏడాది మే 7న ఇండియన్ ఆర్మీ ఆపరేషన్ సిందూర్ ప్రారంభించిన సంగతి తెలిసిందే.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Kethireddy Vasudeva reddy | దొర అహంకారంతో వ్యవహరిస్తున్న బల్మూరి వెంకట్ : డాక్టర్ కేతిరెడ్డి వాసుదేవ రెడ్డి
పర్సాయపల్లిలో బతుకమ్మ విగ్రహానికి కొత్త శోభ
‘పట్టభద్రులు ఓటు హక్కు నమోదు చేసుకోవాలి’
‘అర్హులైన మహిళలందరికీ బతుకమ్మ చీరలు ఇవ్వాలి’
Congress councilors resign | మంత్రి జూపల్లి, ఎంపీ మల్లు రవి పోకడలకు నిరసనగా ఏడుగురు కాంగ్రెస్ కౌన్సిలర్ల రాజీనామా
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

