న్యూఢిల్లీ, ఏప్రిల్ 8 : ఫేస్ అథెంటికేషన్ ద్వారా ఈపీఎఫ్ఓ ఖాతాదారులు యూనివర్సల్ ప్రావిడెంట్ ఫండ్ అకౌంట్ నంబర్ని(యూఏఎన్) జనరేట్ చేయవచ్చని కేంద్ర కార్మిక మంత్రి మన్సుఖ్ మాండవీయ మంగళవారం వెల్లడించారు. ఉమంగ్ మొబైల్ యాప్ను ఉపయోగించి ఆధార్ ఫేస్ అథెంటికేషన్ టెక్నాలజీ(ఎఫ్ఏటీ) ద్వారా ఉద్యోగి నేరుగా యూఏఎన్ని జనరేట్ చేయవచ్చని మంత్రి వివరించారు. కొత్తగా చేరే ఉద్యోగికి ఇదే ఎఫ్ఏటీని ఉపయోగించి ఉమంగ్ యాప్ ద్వారా యూఏఎన్ని యాజమాన్యం కూడా జనరేట్ చేయవచ్చని ఆయన తెలిపారు. ఇదివరకే యూఏఎన్ ఉండి యాక్టివేట్ చేసుకోని ఉద్యోగులు ఉమంగ్ యాప్ ద్వారా తమ యూఏఎన్ని సులభంగా యాక్టివేట్ చేసుకోవచ్చని మాలవీయ అన్నారు.