Emerald lingam | బ్యాంక్ లాకర్లో 500 కోట్ల విలువైన మరకత లింగం.. ఎవరు దాచారు? ఆ లింగం ఎక్కడిది?
Emerald lingam | వేల ఏండ్ల నాటి గుడులలో ఇవి దర్శనం ఇస్తాయి. కాకపోతే ఈ లింగానికి ఉన్న మహిమ గురించి తెలుసుకొని చాలామంది వాటిని దొంగలించే ప్రయత్నాలు చేశారు.
Emerald lingam | ఎమరాల్డ్ లింగం.. దాన్నే తెలుగులో మరకత లింగం లేదా పచ్చ లింగం అని కూడా అంటారు. అది చాలా విలువైనది, మహిమ గలది. ఆ లింగంతో శివుడికి అభిషేకం చేస్తే కోరిన కోరికలు ఖచ్చితంగా నెరవేరుతాయనేది కొందరి నమ్మకం. అందుకే.. ఆ లింగానికి ఎక్కువ విలువ ఉంటుంది. ఇటువంటి లింగాలు పాత కాలం నాటి శివుడి గుడులలో ఉంటాయి. వేల ఏండ్ల నాటి గుడులలో ఇవి దర్శనం ఇస్తాయి. కాకపోతే ఈ లింగానికి ఉన్న మహిమ గురించి తెలుసుకొని చాలామంది వాటిని దొంగలించే ప్రయత్నాలు చేశారు. ముఖ్యంగా దక్షిణ భారతంలో 1980 సంవత్సరం నుంచి చాలా మరకత లింగాలు దొంగతనానికి గురయ్యాయి.

తమిళనాడులోని నాగపట్టణం జిల్లాలోని తిరుకువళై అనే గ్రామంలో ఉన్న శివుడి గుడిలో నుంచి మరకత లింగం మిస్ అయింది. 2016 నుంచి అది కనిపించడం లేదు. దాని కోసం ఇంకా పోలీసులు గాలిస్తూనే ఉన్నారు.
కట్ చేస్తే.. 2022లో అంటే ప్రస్తుతం ఓ మరకత లింగాన్ని పోలీసులు ఒక బ్యాంక్ లాకర్లో ఉన్నట్టు గుర్తించారు. దాని విలువ రూ.500 కోట్లు ఉంటుందని అంచనా వేస్తున్నారు.
తమిళనాడులోని తంజావూరులో ఉన్న ఓ బ్యాంకు లాకర్లో దాన్ని ఓ వ్యక్తి భద్రంగా దాచాడు. ఆ విషయం పోలీసులకు తెలిసి బ్యాంక్ మీద రైడ్ చేసి.. ఆ మరకత లింగాన్ని స్వాధీనం చేసుకున్నారు.

దాన్ని ఎవరు దాచారో వాళ్ల అడ్రస్ తెలుసుకొని అక్కడికి వెళ్లి పోలీసులు ఆరా తీశారు. తంజావూరులోని అరులానంద నగర్లో నివాసం ఉండే ఎన్ఎస్ అరుణ్ అనే వ్యక్తి ఇంటికి వెళ్లిన పోలీసులు ఆ మరకత లింగం గురించి ప్రశ్నించారు.
తనకు లింగం గురించి తెలియదని.. తన తండ్రి సామియప్పన్ దాన్ని బ్యాంక్ లాకర్లో దాచినట్టు అరుణ్ తెలిపాడు. ఇద్దరినీ అదుపులోకి తీసుకున్న పోలీసులు విచారిస్తున్నారు. 8 సెంటీమీటర్ల ఎత్తు ఉన్న ఆ లింగం 530 గ్రాములు ఉందని.. దాని విలువ సుమారు రూ.500 కోట్లు ఉంటుందని పోలీసులు తెలిపారు. 2016లో మిస్ అయిన ఆ మరకత లింగం ఇదేనా కాదా అనే కోణంలో పోలీసులు విచారణ జరుపుతున్నారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Newzealand Cricket | టీమిండియాతో వన్డే సిరీస్.. న్యూజిలాండ్ విధ్వంసక ఓపెనర్లకు పిలుపు..!
Telangana | తెలంగాణలో కొత్త జిల్లాలకు పదేళ్లు.. వికేంద్రీకరణ ప్రయాణంపై తొలి సీఎస్ రాజీవ్‌శర్మ కీలక విశ్లేషణ
Aadi Sai Kumar | ఆది సాయికుమార్‌పై దారుణమైన ట్రోలింగ్.. నాని, రవితేజల పేర్లు ప్రస్తావిస్తూ హీరో స్ట్రాంగ్ కౌంటర్!
Indian Athletes | పేదరికాన్ని జయించి.. ఆసియా క్రీడల్లో పతకాల పంట! మన క్రీడాకారుల స్ఫూర్తిదాయక విజయగాథలు
Saudi Arabia | రియాద్ విమానాశ్రయం దాడిలో 12మంది మృతి.. మూడొందల మందికి గాయాలు..!
ట్రెండింగ్ వార్తలు
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?

